Tecno Spark 8C: బడ్జెట్ సెగ్మెంట్ లో 3GB+3GB ర్యామ్ ఫీచర్ తో వచ్చింది

HIGHLIGHTS

Tecno తన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Spark 8C ను ఈరోజు విడుదల చేసింది

Tecno తన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Spark 8C ను ఈరోజు విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను 3GB ఇంటర్నల్ ర్యామ్ + 3GB వర్చువల్ ర్యామ్ శక్తితో తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ లో ఈ ఫీచర్లతో తో వచ్చిన మొదటి ఫోన్ గా టెక్నో స్పార్క్ 8సి నిలుస్తుంది. Spark 8C స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.7,499 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. అయితే, ఈ ఫోన్ లో అందించిన ఫీచర్లు మాత్రం భారీగా అందించింది.

Tecno Spark 8C: ప్రైస్

Tecno Spark 8C స్మార్ట్ ఫోన్ ను 3GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో కేవలం రూ.7,499 రూపాయల ధరతో విడుదల చేసింది. ఫిబ్రవరి 24 నుండి ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ నుండి అమ్మకానికి వస్తుంది. అయితే, ఇక్కడ సూచించిన ధర కేవలం ఇంట్రడక్టరీ ప్రైస్ మాత్రమే. దీని రెగ్యులర్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

Tecno Spark 8C: సెక్స్

టెక్నో స్పార్క్ 8సి స్మార్ట్ ఫోన్ పెద్ద 6.6 ఇంచ్ HD+ రిజల్యూషన్ డాట్ డిస్ప్లేని కలిగివుంటుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ ను 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగివుంటుంది. ఈ ఫోన్ Unisoc T606 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 3GB ర్యామ్ తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ లేటెస్ట్ HiOS 7.6 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 OS తో నడుస్తుంది.

ఇందులో 3GB ఎక్స్ ప్యాండబుల్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ ని అందించింది. దీని ద్వారా ఇది 6GB వరకూ ర్యామ్ శక్తిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. అంతేకాదు, యాప్స్ వేగంగా ఓపెన్ చేయడానికి మెమొరీ ఫ్యూజన్ ఫీచర్ కూడా అందించినట్లు తెలిపింది. కానీ ఈ రెండు ఫీచర్లు కూడా OTA అప్డేట్స్ ద్వారా అందుతాయని చెప్పింది.           

కెమెరా పరంగా, వెనుక డ్యూయల్ కెమెరా కలిగివుంది. ఇందులో 13MP మైన్ సెన్సార్ మరియు జతగా AI సెన్సార్ ని కలిగివుంటుంది. ముందు భాగంలో, సెల్ఫీల కోసం 8MP సెన్సార్ సెల్ఫీ కెమెరాను కలిగివుంది. టెక్నో ఈ ఫోన్ ను పెద్ద 5000mAh బ్యాటరీ మరియు సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :