Tecno Spark 8 Pro: బడ్జెట్ ధరలో 48MP కెమెరా మరియు మరిన్ని ఫీచర్లతో లాంచ్ చేసింది

Updated on 29-Dec-2021
HIGHLIGHTS

Tecno Spark 8 Pro 48MP కెమెరా మరియు మరిన్ని ఫీచర్లతో లాంచ్

10 వేల బడ్జెట్ ధరలో పెద్ద FHD+ డిస్ప్లే, వేగవంతమైన గేమింగ్ ప్రోసెసర్

ఇటీవల టెక్నో కేవలం 9,000 రూపాయల ధరలో Tecno Spark 8T లాంచ్ చేసిన టెక్నో ఈరోజు ఇదే సిరీస్ నుండి మరొక స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో 48MP కెమెరా మరియు మరిన్ని ఫీచర్లతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 10 వేల బడ్జెట్ ధరలో పెద్ద FHD+ డిస్ప్లే, వేగవంతమైన గేమింగ్ ప్రోసెసర్ మరియు 48MP ట్రిపుల్ కెమెరా వంటి మరిన్ని ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది.

Tecno Spark 8 Pro: ధర

టెక్నో స్పార్క్ 8 Pro స్మార్ట్ ఫోన్ ను 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో కేవలం రూ.10,599 రూపాయల  ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ జనవరి 4న ఆమెజాన్ నుండి సేల్ కి అందుబాటులో ఉంటుంది.

Tecno Spark 8 Pro: సెక్స్

టెక్నో స్పార్క్ 8 ప్రో స్మార్ట్ ఫోన్ పెద్ద 6.8 ఇంచ్ FHD+ (2460×1080) రిజల్యూషన్ డిస్ప్లేని కలిగివుంటుంది. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ గేమింగ్ ప్రోసెసర్ Helio G85 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 6GB ర్యామ్ తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ లేటెస్ట్ HiOS 7.6 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 OS తో నడుస్తుంది.

ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగివుంది. ఇందులో 48MP మైన్ సెన్సార్ కి జతగా 2MP పోర్ట్రైట్ సెన్సార్ మరియు AI సెన్సార్ ని కలిగివుంటుంది. ముందు భాగంలో, సెల్ఫీల కోసం 8MP సెన్సార్ సెల్ఫీ కెమెరాను కూడా కలిగివుంది. ఈ కెమెరాతో 2K Time-Lapse ఫోటో గ్రఫీ మరియు Slo-Mo వీడియోలను కూడా రికార్డ్ చేయవచ్చు. ఈ లేటెస్ట్ టెక్నో ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే పెద్ద 5000mAh బ్యాటరీతో వచ్చింది. 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :