ప్రపంచంలో అత్యంత స్లీక్ ఫోన్ గా వచ్చిన Tecno Pova Slim 5G ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

Updated on 04-Sep-2025
HIGHLIGHTS

టెక్నో ఈరోజు ఇండియన్ మార్కెట్లో కొత్త Tecno Pova Slim 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది

ఈ ఫోన్ ను ప్రపంచంలో అత్యంత స్లీక్ ఫోన్ గా మార్కెట్లో ప్రవేశపెట్టింది

ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 5.95 mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది

టెక్నో ఈరోజు ఇండియన్ మార్కెట్లో కొత్త Tecno Pova Slim 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను ప్రపంచంలో అత్యంత స్లీక్ ఫోన్ గా మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 5.95 mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది. ఈ ఫోన్స్ సరికొత్త డిజైన్ లో కూడా ఉంటుంది. టెక్నో సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దామా.

Tecno Pova Slim 5G: ఫీచర్స్

ముందుగా, ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ మరియు సరికొత్త కెమెరా సెటప్ తో ఉంటుంది. ఈ ఫోన్ కేవలం 5.95 mm మందంతో అత్యంత స్లీక్ ఫోన్ గా నిలుస్తుంది మరియు కేవలం 156 g గ్రాముల బరువుతో చాలా తేలికైన ఫోన్ గా కూడా నిలుస్తుంది. ఈ ఫోన్ 6.78 ఇంచ్ 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 144Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 7i మరియు 1.5K రిజల్యూషన్ కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను డైనమిక్ మూడ్ లైట్ డిజైన్ అందించింది. ఇది చూడడానికి ఈ ఫోన్ ను సరికొత్తగా మరియు విలక్షణంగా ఉండేలా చేసింది. ఇందులో 50MP మరియు 2MP డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 13MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. అయితే, ఈ ఫోన్ కెమెరా 2K రిజల్యూషన్ వీడియో సపోర్ట్ మాత్రమే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ AI కెమెరా ఫీచర్స్ మరియు మంచి ఫోటోలు అందించే సత్తా కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.

టెక్నో పోవా స్లిమ్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 6400 5జి చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు జతగా 8జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Ella AI ఫీచర్ తో తెలుగు, కన్నడ తమిళం మరియు హిందీ వంటి అన్ని రీజినల్ లాంగ్వేజ్ లకు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 4×4 MIMO ఫీచర్ తో మంచి స్పీడ్ నెట్ వర్క్ ను ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ MIL-STD-810H మిలటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ సపోర్ట్ మరియు IP64 రేటింగ్ తో ఫీచర్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. 5160 mAh బ్యాటరీ మరియు వేగంగా ఫోన్ ను ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో అందించింది.

Also Read: GST 2.0 Reform: కొత్త జీఎస్టీ తో భారీగా తగ్గనున్న Smart Tv మరియు AC ధరలు.!

Tecno Pova Slim 5G: ప్రైస్

టెక్నో పోవా స్లిమ్ 5జి స్మార్ట్ ఫోన్ ను రూ. 19,999 ధరతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కూల్ బ్లాక్, స్కై బ్లూ మరియు స్లిమ్ వైట్ మూడు రంగుల్లో లభిస్తుంది. సెప్టెంబర్ 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ మొదటి సేల్ మొదలవుతుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :