లీకైన Tecno Pova 3 లాంచ్ డేట్: 7,000mAh బిగ్ బ్యాటరీతో వస్తోంది..!!

HIGHLIGHTS

Tecno Pova 3 స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ లీకయ్యింది

ఈ స్మార్ట్ ఫోన్ ను టెక్నో జూన్ 20 న ఇండియాలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది

ఈ స్మార్ట్ ఫోన్ భారీ 7000mAh బిగ్ బ్యాటరీతో వస్తోంది

Tecno Pova 3 స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ లీకయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ను టెక్నో జూన్ 20 న ఇండియాలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ భారీ 7000mAh బిగ్ బ్యాటరీతో వస్తోంది. అలాగే, ఈ ఫోన్ గురించి అమెజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ అందించింది. అయితే, అమెజాన్ ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను మాత్రం సూచించలేదు. కానీ, ఈ ఫోన్ ను టెక్నో జూన్ 20 న విడుదల చేస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి.   

Tecno Pova 3: స్పెక్స్

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన వివరాలను కంపెనీ ఇప్పటికే టీజర్ ద్వారా వెల్లడించింది. దీని ప్రకారం, టెక్నో పోవా 3 అతిపెద్ద 7000 mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వేగవంతమైన గేమింగ్ ప్రాసెసర్ Helio G88 శక్తితో పనిచేస్తుంది. అంతేకాదు, దీనికి జతగా 6GB ర్యామ్ మరియు 5GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ ను కూడా జత చేసినట్లు ప్రకటించింది. ఇక డిస్ప్లే పరంగా, ఈ ఫోన్ లో బిగ్ 6.9 ఇంచ్ FHD+ డాట్ డిస్ప్లేని కూడా అందించింది.

కెమెరా వివరాలను కూడా టెక్నో టీజర్ ద్వారా బయటపెట్టింది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది మరియు ఇందులో 50MP మైన్ కేమెరా వుంది. అలాగే, క్వాడ్ LED ఫ్లాష్ కూడా వుంది. గేమింగ్ కోసం 4D వైబ్రేషన్ Z-Axiz లీనియర్ మోటార్ మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కూడా ఈ ఫోన్ కలిగి వుంది.

అయితే, ప్రస్తుతానికి ఈ ఫోన్ యొక్క స్పెక్స్ మరియు ఫీచర్లను మాత్రమే టెక్నో వెల్లడించింది. కానీ, విడుదల తేదీని మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్ ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు టీజింగ్ చేస్తోంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :