Tecno Pop 8 Up: ఆకట్టుకునే డిజైన్ తో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్న టెక్నో.!

HIGHLIGHTS

Tecno Pop 8 Up లాంచ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ తో టీజింగ్ స్టార్ట్ చేసింది

ఈ ఫోన్ చాలా స్లీక్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో కనిపిస్తోంది

టెక్నో కంపెనీ త్వరలోనే Tecno Pop 8 Up లాంచ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది. అమేజాన్ స్పెషల్ గా తీసుకు వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ తో టీజింగ్ స్టార్ట్ చేసింది. ఈ ఫోన్ చాలా స్లీక్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో కనిపిస్తోంది. బడ్జెట్ ఫ్రెండ్లి సిరీస్ గా ఈ టెక్నో పాప్ సిరీస్ ముందు నుండే సుపరిచితమైనది. అంటే, ఈ ఫోన్ ను కూడా బడ్జెట్ ధరలో లాంచ్ చేసే అవకాశం ఉంటుంది.

Tecno Pop 8 Up

అమేజాన్ ఈ టెక్నో పాప్ 8 అప్ కోసం అందించిన ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ నుండి ఈ ఫోన్ కీలకమైన స్పెక్స్ తో టీజింగ్ చేస్తోంది. ఈ టీజర్ పేజ్ ద్వారా, ఈ ఫోన్ లో 4GB RAM మరియు 4GB మెమొరీ ఫ్యూజన్ కలిపి టోటల్ 8GB ర్యామ్ ఉన్నట్లు చెబుతోంది. ఈ ఫోన్ లో 64GB అంతర్గత మెమొరీ కూడా ఉన్నట్లు వెల్లడించింది.

టెక్నో పాప్ 8 అప్

టెక్నో పాప్ 8 అప్ ఫోన్ గ్రావిటీ బ్లాక్ మరియు మిస్టరీ వైట్ రెండు కలర్ ఆప్షన్ లలో వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కేమెరా సెటప్ మరియు సింగిల్ LED ఫ్లాష్ కనిపిస్తున్నాయి. అయితే, ఈ సెటప్ చూడటానికి ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమేరా ఉన్నట్లు కనిపించే చేస్తోంది.

Also Read : Poco X6 Series: అప్ కమింగ్ ఫోన్స్ టీజర్ విడుదల చేసిన పోకో.!

ఇది 12MP AI డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ తో వస్తోంది. ఈ ఫోన్ వెనుక ప్యానల్ లో క్రాస్ లైన్స్ కలిగిన విలక్షణమైన డిజైన్ తో కనిపిస్తోంది. టెక్నో పాప్ 8 అప్ ఫోన్ లో సెంటర్ పంచ్ హోల్ డిజైన్ సెల్ఫీ కెమేరా డిజైన్ తో కనిపిస్తోంది. దీనికి చుట్టూ నోటిఫికేషన్ బార్ ఉన్నట్లు కూడా కనిపిస్తోంది.

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు మరిన్ని వివరాలను త్వరలోనే అందించే అవకాశం వుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :