Tecno Pop 8: కొత్త డిజైన్ కొత్త ఫీచర్లతో సరసమైన ధరలో వచ్చింది.!

HIGHLIGHTS

టెక్నో సరికొత్తగా విడుదల చేసిన Tecno Pop 8

డ్యూయల్ DTS స్పీకర్లతో వచ్చిన టెక్నో కొత్త ఫోన్

ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో మరియు బ్యాంక్ ఆఫర్లతో టెక్నో లాంచ్ చేసింది

టెక్నో బ్రాండ్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ రోజు ఇండియన్ మార్కెట్ లో విడుదల అయ్యింది. అదే, టెక్నో సరికొత్తగా విడుదల చేసిన Tecno Pop 8 స్మార్ట్ ఫోన్. టెక్నో ఈ స్మార్ట్ ఫోన్ ను డ్యూయల్ DTS స్పీకర్లు మరియు 4GB మెమొరీ ఫ్యూజన్ వంటి మరిన్ని ఫీచర్లతో లాంచ్ చెయ్యబడింది. ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో మరియు బ్యాంక్ ఆఫర్లతో టెక్నో లాంచ్ చేసింది. టెక్నో పాప్ 8 స్మార్ట్ ఫోన్ యొక్క ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకోండి.

Tecno Pop 8 Price

టెక్నో పాప్ 8 స్మార్ట్ ఫోన్ ను రూ. 6,499 రూపాయల ధరతో విడుదల చేసింది. అయితే, లాంచ్ ఆఫర్ లో భాగంగా బ్యాంక్ డిస్కౌంట్ తో కలిపి రూ. 5,999 ధరకే అందిస్తున్నట్లు తెలిపింది. టెక్నో పాప్ 8 స్మార్ట్ ఫోన్ జనవరి 9వ తేదీ మొదటి సారి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ అమేజాన్ ఇండియా నుండి సేల్ అవుతుంది.

Also Read : Moto G34 5G: మోటో అప్ కమింగ్ బడ్జెట్ 5G ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫీచర్లు లీక్.!

టెక్నో పాప్ 8 ప్రత్యేకతలు

టెక్నో పాప్ 8 స్మార్ట్ ఫోన్ ను డైనమిక్ పోర్ట్ ఫీచర్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.6 ఇంచ్ HD+ డిస్ప్లేతో లాంచ్ చేసింది. ఈ టెక్నో స్మార్ట్ ఫోన్ Unisoc T606 ఆక్టా కోర్ 4జి ప్రోసెసర్ తో లాంచ్ చేసింది. ఇది 4GB ర్యామ్ మరియు 4GB మెమొరీ ఫ్యూజన్ ఫీచర్ తో 8GB RAM ఫీచర్ తో వస్తుంది. ఈ ఫోన్ లో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు విలక్షణమైన డిజైన్ ను కలిగి ఉంటుంది.

టెక్నో పాప్ 8 ప్రత్యేకతలు

ఈ టెక్నో కొత్త ఫోన్ 12MP AI డ్యూయల్ రేర్ కెమేరా మరియు 8MP సెల్ఫీ కెమేరాని కలిగి వుంది. ఈ ఫోన్ లో టైప్ C ఛార్జ్ పోర్ట్ తో 5000mAh బిగ్ బ్యాటరీని అందించింది. ఈ టెక్నో ఫోన్ HiOS 13.0 సాఫ్ట్ వేర్ తో పనిచేసే Android 13 Go Edition స్మార్ట్ ఫోన్. ఇందులో పెద్ద సౌండ్ అందించ గల డ్యూయల్ DTS Speaker లను కలిగి వుందని మరియు ఈ సెగ్మెంట్ లో ఈ ఫీచర్ తో వచ్చిన మొదటి ఫోన్ అని టెక్నో తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :