బడ్జెట్ ధరలో పెద్ద డిస్ప్లే మరియు 6,000mAh బ్యాటరీతో వచ్చిన Tecno Pop 5 Pro

HIGHLIGHTS

Tecno తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Tecno Pop 5 Pro ని ఇండియాలో ఆవిష్కరించింది.

FHD+ డిస్ప్లే, పెద్ద బ్యాటరీ మరియు అందమైన డిజైన్ తో తీసుకొచ్చింది

Tecno తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Tecno Pop 5 Pro ని ఇండియాలో ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను అతితక్కువ బడ్జెట్ ధరలో పెద్ద FHD+ డిస్ప్లే, పెద్ద బ్యాటరీ మరియు అందమైన డిజైన్ తో తీసుకొచ్చింది. భారతీయ బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని   ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.8,499 ధరలో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్లు మరియు మరిన్ని వివరాలను గురించి చూద్దాం.       

Tecno Pop 5 Pro: ధర

టెక్నో పాప్ 5 ప్రో స్మార్ట్ ఫోన్ ను కేవలం 3GB ర్యామ్ మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ సింగిల్ వేరియంట్ ను రూ.8,499 రూపాయల  ధరతో విడుదల చేసింది.

Tecno Pop 5 Pro: సెక్స్

టెక్నో పాప్ 5 ప్రో స్మార్ట్ ఫోన్ పెద్ద 6.52 ఇంచ్ HD+ రిజల్యూషన్ డిస్ప్లేని  కలిగివుంటుంది. ఈ ఫోన్ డిస్ప్లే 120Hz టచ్ శాంప్లింగ్ రేట్ మరియు 480 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందిస్తుంది. ఇది ప్రోసెసర్ కి జతగా 3GB ర్యామ్ తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ లేటెస్ట్ HiOS 7.6 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 Go ఎడిషన్ తో నడుస్తుంది.

ఈ ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ కలిగివుంది. ఇందులో 8MP మైన్ సెన్సార్ కి జతగా AI సెన్సార్ ని కలిగివుంటుంది. ముందు భాగంలో, సెల్ఫీల కోసం 5MP సెల్ఫీ కెమెరాను కూడా కలిగివుంది. ఈ కెమెరాలతో AI పోర్ట్రైట్ ఫోటో గ్రఫీ మరియు వీడియోలను కూడా రికార్డ్ చేయవచ్చు. ఈ లేటెస్ట్ టెక్నో ఫోన్ నార్మల్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే పెద్ద 6,000mAh బ్యాటరీతో వచ్చింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :