భారీ ఫీచర్లతో Tecno Phantom X2 5G లాంచ్.. ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.!

HIGHLIGHTS

ఇండియాలో టెక్నో మరొక స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది

Curved AMOLED డిస్ప్లేతో వచ్చిన Tecno Phantom X2 5G

ఈ స్మార్ట్ ఫోన్ Dimensity 900 5G శక్తితో పనిచేస్తుంది

ఇండియాలో టెక్నో మరొక స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది మరియు ఈ ప్రైస్ రేంజ్ సెగ్మెంట్ లో Dimensity 9000 5G చిప్ సెట్ తో వచ్చిన మొదటి ఫోన్ కూడా ఇదే అవుతుంది. ఇప్పటికి వరకూ ప్రీమియం ఫోన్లలో మాత్రమే ఈ సిప్ సెట్ కనిపించగా, టెక్నో దీన్ని మిడ్ రేంజ్ ఫోన్ లో కూడా అందించడం విశేషం. అంతేకాదు, పెద్ద AMOLED డిస్ప్లే, ఫాస్ట్ ర్యామ్ తో పాటుగా వేగవంతమైన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ ను ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది. భారీ ఫీచర్లతో వచ్చిన ఈ Tecno Phantom X2 స్మార్ట్ ఫోన్ యొక్క ధర, స్పెక్స్ మరియు ఫీచర్లను తెలుసుకోండి. 

Tecno Phantom X2: స్పెక్స్

టెక్నో ఫాంటమ్ ఎక్స్ 2 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.8 ఇంచ్ FHD+ Curved AMOLED డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో కలిగివుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ 4nm ఫ్యాబ్రికేషన్ ప్రాసెసర్ Dimensity 900 5G శక్తితో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 3.05Ghz క్లాక్ స్పీడ్ కలిగివుంటుంది. ఈ ప్రాసెసర్ కి జతగా 12GB LPDDR5 ర్యామ్ మరియు 256 GB UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది. 

ఈ ఫోన్ వెనుక విలక్షణమైన కెమెరా డిజైన్ తో వస్తుంది మరియు ట్రిపుల్ రియర్ కెమెరా సెట్టింగ్ కలిగివుంది. ఇందులో, 64MP OIS RGBW (G+P) ప్రధాన కెమేరాకి జతగా 13MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ వున్నాయి. ముందుభాగంలో, 32MP సెల్ఫీ కెమెరాని వీడియో కాల్ మరియు సెల్ఫీల కోసం అందించింది. ఈ ఫోన్ 5160 mAh బిగ్ బ్యాటరీని 45W ఫాస్ట్ కెహెర్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. 

Tecno Phantom X2: ధర

టెక్నో ఫాంటమ్ ఎక్స్ 2 స్మార్ట్ ఫోన్ ను రూ.39,999 రూపాయల ధరతో ఇండియన్ మర్కెట్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ స్టార్ డస్ట్ గ్రే మరియు మూన్ లైట్ సిల్వర్ అనే రెండు కలర్ అప్షన్.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :