Tecno Spark 7 Pro: టెక్నో నుండి కొత్త ఫోన్

HIGHLIGHTS

ఇండియాలో మరొక కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చెయ్యడానికి టెక్నో సిద్దమవుతోంది

పంచ్ హోల్ మరియు స్టయిలిష్ డిజైన్ తో లాంచ్ చేస్తోంది

టెక్నో స్పార్క్ 7 ప్రో మంచి ఫీచర్లతో బడ్జెట్ ధరలోనే మార్కెట్ లోకి రావచ్చు

ఇండియాలో మరొక కొత్త  స్మార్ట్ ఫోన్ లాంచ్ చెయ్యడానికి టెక్నో సిద్దమవుతోంది. మే 25 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి Tecno Spark 7 Pro స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ ను పంచ్ హోల్ మరియు స్టయిలిష్ డిజైన్ తో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ మంచి ఫీచర్లతో బడ్జెట్ ధరలోనే మార్కెట్ లోకి రావచ్చు.

Tecno Spark 7 Pro: స్పెక్స్

Tecno Spark 7 Pro లో 6.6 అంగుళాల పంచ్ హోల్ డిజైన్ డిస్ప్లేని HD+ రిజల్యూషన్ తో కలిగి వుంటుంది. ఈ ఫోన్ మీడియా టెక్ హీలియో G80 చిప్ సెట్ తో 4 జిబి / 64 జిబి, 4 జిబి / 128 జిబి మరియు 6 జిబి / 128 జిబి వేరియంట్లలో అందించబడుతుంది. అధనపు స్టోరేజ్ కోసం మైక్రో SD కార్డు అప్షన్ కూడా వుంటుంది.

ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ చాలా పెద్దగా ఆకర్షణీయంగా కనిపించేలా డిజైన్ చేసారు. ఈ సెటప్ లో 48MP ప్రధాన కెమెరా కలిగిన AI ట్రిపుల్ కెమెరాలు ఉంటాయి. ఇక ఫోన్ ముందు భాగంలో వున్నా పంచ్ హోల్ కటౌట్ లో 16MP సెల్ఫీ కెమెరా కూడా వుంటుంది.

టెక్నో స్పార్క్ 7 ప్రో పెద్ద 5,000 mAh బ్యాటరీని 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి వుంటుంది. ఈ ఫోన్ HiOS 7.5 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 తో పనిచేస్తుంది. వెనుక ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫాస్ట్ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది.                                          

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :