Tecno Spark 8 Pro: బడ్జెట్ ధరలో 33W ఫాస్ట్ ఛార్జింగ్, 48MP కెమెరాతో వచ్చింది… మొదటి సేల్ ఎప్పుడంటే..!

HIGHLIGHTS

ఇండియన్ మార్కెట్లోకి Tecno Spark 8 Pro ను ప్రవేశపెట్టింది

ఈ ఫోన్ తక్కువ ధరలో మంచి ఫీచర్లను కలిగివుంది

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ కొత్త సంవత్సరంలో జరగనుంది

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ Tecno కేవలం 10 వేల బడ్జెట్ ధరలో పెద్ద FHD+ డిస్ప్లే, వేగవంతమైన గేమింగ్ ప్రోసెసర్, 33W ఛార్జింగ్ సపోర్ట్ మరియు 48MP ట్రిపుల్ కెమెరా వంటి మరిన్ని ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లోకి Tecno Spark 8 Pro ను ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ తక్కువ ధరలో మంచి ఫీచర్లను కలిగివుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ కొత్త సంవత్సరంలో జరగనుంది. 

Tecno Spark 8 Pro: ధర

టెక్నో స్పార్క్ 8 Pro స్మార్ట్ ఫోన్ ను 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో కేవలం రూ.10,599 రూపాయల  ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ జనవరి 4న ఆమెజాన్ నుండి సేల్ కి అందుబాటులో ఉంటుంది.

Tecno Spark 8 Pro: సెక్స్

టెక్నో స్పార్క్ 8 ప్రో స్మార్ట్ ఫోన్ పెద్ద 6.8 ఇంచ్ FHD+ (2460×1080) రిజల్యూషన్ డిస్ప్లేని కలిగివుంటుంది. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ గేమింగ్ ప్రోసెసర్ Helio G85 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 6GB ర్యామ్ తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ లేటెస్ట్ HiOS 7.6 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 OS తో నడుస్తుంది.

ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగివుంది. ఇందులో 48MP మైన్ సెన్సార్ కి జతగా 2MP పోర్ట్రైట్ సెన్సార్ మరియు AI సెన్సార్ ని కలిగివుంటుంది. ముందు భాగంలో, సెల్ఫీల కోసం 8MP సెన్సార్ సెల్ఫీ కెమెరాను కూడా కలిగివుంది. ఈ కెమెరాతో 2K Time-Lapse ఫోటో గ్రఫీ మరియు Slo-Mo వీడియోలను కూడా రికార్డ్ చేయవచ్చు. ఈ లేటెస్ట్ టెక్నో ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే పెద్ద 5000mAh బ్యాటరీతో వచ్చింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :