స్పెక్స్ సరిపోలిక : వివో V15 ప్రో vs హానర్ వ్యూ 20

HIGHLIGHTS

ఈ రెండు పవర్ఫుల్ కెమేరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్లను సరిపోల్చి చూద్దాం.

స్పెక్స్ సరిపోలిక : వివో V15 ప్రో vs హానర్ వ్యూ 20

చాలా కాలంగా టీజింగ్ చేసిన తరువాత, వివో చివరకు తన V15 ప్రో స్మార్ట్ ఫోన్నురూ. 28,990 ధరతో భారతదేశంలో విడుదల చేసింది . వివో నెక్స్ తర్వాత పాప్-అప్ సెల్ఫీ కెమెరా కలిగిన సంస్థ యొక్క రెండో ఫోన్ ఇది. ఈ ఫోన్ వెనుక ఒక ట్రిపుల్ కెమెరా సెటప్ను కలిగి ఉంది మరియు డిస్ప్లేలో ఒక వేలిముద్ర సెన్సారుతో వస్తుంది. మరొక వైపు, మనకి హానర్ వ్యూ 20 ఉంది, ఇది కిరిన్ 980 ఆక్టా -కోర్ ప్రాసెసర్ చేత శక్తిని కలిగి ఉంది మరియు ఇది ముందు 25MP సెన్సార్ను కలిగి ఉంటుంది. మార్కెట్లో సరికొత్తగా వచ్చిన ఈ రెండు స్మార్ట్ ఫోనల్ను సరిపోల్చు చూద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vivo V15 Pro vs Honor View 20.png

ఈ రెండు స్మార్ట్ ఫోన్  డిస్ప్లేలను వివరంగా పోల్చడం ద్వారా ప్రారంభిద్దాం. 2340 x 1080 పిక్సెల్స్ యొక్క రిజల్యూషన్ను అందించే ఒక 6.39-అంగుళాల డిస్ప్లేను వివో V15 ప్రో అందిస్తుంది. మరొక వైపు, హానర్ వ్యూ 20 కూడా 2310 x 1080 పిక్సల్స్ యొక్క రిజల్యూషన్ను అందించే ఒక  6.39-అంగుళాల స్క్రీన్ ను కలిగి ఉంటుంది.

వీటి పనితీరు విషయానికి వస్తే, వివో V15 ప్రో ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసరుకి జతగా 6GB RAM మరియు 128GB అంతర్గత మెమరీతో వస్తుంది,ఇంకా  మైక్రో SD కార్డు ద్వారా 256GB వరకు దీని స్టోరేజిని విస్తరించవచ్చు. మరోవైపు, హానర్ వ్యూ 20 ఒక కిరిన్ 970 ఆక్టా -కోర్ ప్రాసెసర్ మద్దతు ఇస్తుంది, ఇది 6GB RAM మరియు 128GB అంతర్గత మెమరీతో జతగా వస్తుంది.

కెమెరాల విభాగానికి వస్తే, వివో V15 ప్రో ముందు ఒక 32MP పాప్-అప్ సెల్ఫీ కెమెరా మరియు వెనుకవైపు ఒక ట్రిపుల్ 48MP + 8MP + 5MP కెమెరా సెటప్ను కలిగి ఉంది. ఇక హానర్ వ్యూ 20 వెనుక ఒక  48MP + TOF డ్యూయల్ కెమెరాలతో పాటు ముందు 25MP సెల్ఫీ కెమేరాని కలిగి ఉంటుంది.

హానర్ వ్యూ 20 భారతదేశం లో రూ .37,999 ధరతో అందుబాటులో ఉంది, ఇక వివో V15 ప్రో రూ .28,990 ధరతో భారతదేశంలో విడుదలచేయబడింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo