Sony 5G Phone: 120 fps 4K HDR వీడియో రికార్డ్ చెయ్యగల ఫోన్ లాంచ్ చేసిన Sony.!

Sony 5G Phone: 120 fps 4K HDR వీడియో రికార్డ్ చెయ్యగల ఫోన్ లాంచ్ చేసిన Sony.!
HIGHLIGHTS

Sony నుండి 120 fps 4K HDR వీడియో రికార్డ్ చెయ్యగల ఫోన్ లాంచ్

ఈ స్మార్ట్ ఫోన్ 52MP Exmor T For Mobile సెన్సార్ తో వచ్చిన మొదటి ఫోన్

మార్కెట్ లో ఇప్పటి వరకూ లేని భారీ కెమేరా ఫీచర్స్ తో Sony 5G Phone ని లాంచ్ చేసింది

Sony 5G Phone: 120 fps 4K HDR వీడియో రికార్డ్ చెయ్యగల ఫోన్ లాంచ్ చేసిన Sony. సోనీ బ్రాండ్ అంటేనే పెర్ఫెక్షన్ కు పెట్టింది పేరని అందరికీ తెలిసిన విషయమే. అయితే, స్మార్ట్ ఫోన్ కేటగిరిలో మాత్రం కాస్త వెనక బడింది. అయితే, ఇప్పుడు ఈ మాట Sony బ్రాండ్ కు నప్పకపోవచ్చు. ఎందుకంటే, మార్కెట్ లో ఇప్పటి వరకూ లేని భారీ కెమేరా ఫీచర్స్ తో Sony 5G Phone ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 52MP Exmor T For Mobile సెన్సార్ తో వచ్చిన మొదటి ఫోన్ మరియు ఈ కేమెరా మీ ఫోటో ఐడియాస్ కి అద్భుతాలను జోడించగలదు.

ఇప్పటి వరకూ మనం మాట్లాడుకుంటోంది Sony మార్కెట్ లో కొత్తగా విడుదల చేసిన Sony 5G Phone స్మార్ట్ ఫోన్ Sony Xperia 5 V గురించే. ఈ Sony 5G Phone చూడటానికి చాలా సింపుల్ గా కనిపించినా చాలా పవర్ ఫుల్ స్పెక్స్ మరియు ఫీచర్స్ ను కలిగి వుంది. Sony Xperia 5 V ముఖ్యంగా కెమేరారా కేటగిరిలో అద్భుతమైన ప్రత్యేకతలను కలిగి వుందని ఆలోచించ కుండా చెప్పవచు. 

Sony Xperia 5 V Specs 

Sony Xperia 5 V స్మార్ట్ ఫోన్ సింగిల్ హైడ్ తో యూజ్ చెయ్యగల 6.1 ఇంచ్ సైజు HDR OLED డిస్ప్లేతో వచ్చింది. ఈ డిస్ప్లే FHD+ రిజల్యూషన్ (2520×1080), 120Hz రిఫ్రెష్ రేట్ మరియు మరిన్ని కలర్స్ అందించ గల Creater Mode ఫీచర్ తో వచ్చింది. ఈ ఫోన్ బ్లేజింగ్ స్పీడ్ 5G Processor అయిన Snapdragon 8 Gen 2 ప్రోసెసర్ శక్తితో పని చేస్తుంది. ఇవన్ని ఒక ఎత్తయితే కెమేరా నెక్స్ట్ లెవల్ అని చెబుతాను.

Sony Xperia 5 V Camera గురించి Sony చాలా గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ లో 52MP Exmor T For Mobile సెన్సార్ మరియు 12MP Exmor RS For Mobile సెన్సార్లు కలిగిన డ్యూయల్ కేమెరా సెటప్ అందించింది. ఈ ఫోన్ కెమేరా 4K HDR వీడియో లను 24fps , 25fps , 30fps, 60fps మరియు 120fps వద్ద కూడా రికార్డ్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఆప్టికల్ స్టడీ షాట్, ఆబ్జెక్ట్ ట్రాకింగ్, Video Pro Live Streaming వంటి చాలా ఫీచర్స్ తో వస్తుంది. 

ఈ ఫోన్ తో ZEISS T Coating ఆప్టిక్స్ తో వస్తుంది మరియు OIS Photo, 6X హై బ్రిడ్ జూమ్, HDR Photo వంటి చాలా ఫోటో ఇమేజ్ ఫీచర్స్ తో కూడా వస్తుంది. 

ఈ Sony 5G Phone గురించి సింపుల్ గా చెప్పాలంటే సింపుల్ గా కనిపించే పవర్ ఫుల్ 5G స్మార్ట్ ఫోన్. 
                                            
Sony Xperia 5 V ఫోన్ ప్రస్తుతం UK మార్కెట్ లో లాంచ్ చెయ్యబడింది మరియు ఈ ఫోన్ ను 999 Euros (సుమారు రూ. 89,700) ధరలో Sony విడుదల చేసింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo