కొన్ని క్వాల్కమ్ చిప్ సెట్లు 192MP కెమేరా వరకు సపోర్ట్ చేస్తాయి

HIGHLIGHTS

వాటిలో రెడ్మి నోట్ 7 ప్రో లో అందించిన స్నాప్ డ్రాగన్ 675 కూడా ఉంది.

కొన్ని క్వాల్కమ్ చిప్ సెట్లు 192MP కెమేరా వరకు సపోర్ట్ చేస్తాయి

ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ కూడా మొబైల్ కొనుగోలు చేసేప్పుడు గమనించి ముఖ్య విషయం, ఆ మొబైల్లో వున్న కెమేరా మరియు ప్రాసెసర్. అవును, ఇది నిజంగానే గమనించాల్సిన విషయం. ఇది గమనించిన, చిప్ సెట్ తయారీ దిగ్గజమైన క్వాల్కమ్, తాజాగా తీసుకొచ్చిన చిప్ సెట్లలో ఈ పనితాన్ని అందించింది మరియు ఇంకా మెరుగుపరిచేందుకు దాని పైన ద్రుష్టి సారించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

  క్వాల్కమ్ యొక్క ఫ్లాగ్ షిప్ చిప్ సెట్ అయినటువంటి, స్నాప్ డ్రాగన్ 855, మరియు అంతకు ముందున్న ఫ్లాగ్ షిప్, స్నాప్ డ్రాగన్ 845 వంటి వాటికీ మంచి కెమేరా రేంజ్ అందించింది. అంతేకాదు, వీటితో పాటుగా స్నాప్ డ్రాగన్ 670,675 మరియు 710 లకు కూడా 192 MP కెమేరాని కూడా హ్యాండిల్ చేయగల సామర్ధ్యాలను అందించింది. అయితే, ఇది డ్యూయల్ కెమేరాలకి మాత్రం కాదు 192MP వరకు సింగిల్ కెమెరాకి సపోర్ట్ చేసేలా వీటిని అందించినట్లు తెలుస్తోంది.

అందుకే,ఇటీవల షావోమి ప్రతిష్టాత్మకంగా భారతదేశంలో విడుదల చేసినటువంటి రెడ్మి నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ ఒక ప్రధాన 48MP కెమేరాతో చక్కగా పనిచేస్తుంది. అలాగే, ఎటువంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా 48MP ఫొటో లను తీయగలుగుతుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 675 ప్రొసెసరును అందించారు. అలాగే, ఇది స్పీడ్ ఛార్జింగ్ కు కూడా మద్దతిస్తుంది మరియు ఫోన్ ముందున్న ప్రాసెసర్ల కంటే మరింత వేగంగా కూడా పనిచేస్తుంది.     

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo