షాకిచ్చిన కేంద్రం….భారీగా పెరగనున్న స్మార్ట్ ఫోన్ ధరలు..!!

Updated on 03-Oct-2020
HIGHLIGHTS

కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయంతో స్మార్ట్ ఫోన్ ధరలకు రెక్కలు.

ఇక ఆ అవకాశం ఉండదేమో అనిపిస్తోంది.

షియోమి, ఆపిల్, ఒప్పో తో సహా అన్ని ప్రముఖ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ ధరలు భారీగా పెరగనున్నాయి.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయంతో స్మార్ట్ ఫోన్ ధరలకు రెక్కలు. త్వరలో రానున్న పండుగ సీజన్ లో మంచి అఫర్ తో స్మార్ట్ ఫోన్ కొనాలని ఎదురుచూస్తున్న వారిలో మీరు కూడా ఉన్నారా?. ఇక ఆ అవకాశం ఉండదేమో అనిపిస్తోంది. ఎందుకంటే, లేటెస్ట్ గా కేంద్ర ప్రభుత్వం విధించిన 10 దిగుమతి సుంకంతో షియోమి, ఆపిల్, ఒప్పో తో సహా అన్ని ప్రముఖ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ ధరలు భారీగా పెరగనున్నాయి. స్మార్ట్ ఫోన్ లో ఉపయోగించే డిస్ప్లే మరియు టచ్ ప్యానళ్లకు ఈ 10 శాతం సుంకాన్ని వర్తిపచేసింది.

కేంద్రం, ఆత్మనిర్బర్ భారత్ కార్యక్రమం ద్వారా దేశీయ వస్తువుల తయారీని మరింతగా పెంచడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి, ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న వస్తువుల పైన సుంకం భారాన్ని మోపాలని ఆలోచిస్తోంది. తద్వారా, దేశీయంగా తయారీని పెంచవచ్చు. అయితే, స్మార్ట్ ఫోన్ తయారీ కోసం ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న డిస్ప్లే మరియు టచ్ ప్యానళ్లకు ఇప్పుడు ఈ 10 శాతం సుంకం వర్తిస్తుంది. కాబట్టి, రానున్న రోజుల్లో స్మార్ట్ ఫోన్ ధరలు అమాంతంగా పెరిగిపోవచ్చు.

వాస్తవానికి, ఈ భారాన్ని మోయాల్సింది మాత్రం స్మార్ట్ ఫోన్ లేదా మొబైల్ ఫోన్ కొనుగోలుదారులు. కొన్ని నివేదికల ప్రకారం, ఇప్పుడు విధించిన 10 శాతం దిగుమతి సుంకం వలన స్మార్ట్ ఫోన్ ధరలు గరిష్టంగా 5 శాతం వరకూ పెరిగే అవకాశం వుంటుంది. షియోమి, రియల్ మీ, ఆపిల్, ఒప్పో మరియు మరిన్ని కంపెనీల స్మార్ట్ ఫోన్ల ధరలు పెరగవచ్చు.  

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :