Samsung Glaxy M12 బడ్జెట్ దరలో పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ గా వచ్చింది

Updated on 11-Mar-2021
HIGHLIGHTS

సాంసంగ్ గెలాక్సీ ఎం12 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన సాంసంగ్

గెలాక్సీ ఎం12 స్మార్ట్ ఫోన్ ను ఆకర్షణీయమైన ఫీచర్లతో లాంచ్ చేసింది

48MP క్వాడ్ కెమెరాతో వచ్చింది.

సాంసంగ్ గెలాక్సీ ఎం12 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన సాంసంగ్. ఈ గెలాక్సీ M12 స్మార్ట్ ఫోన్ కేవలం బడ్జెట్ ధరలో స్టైలిష్ డిజైన్, పవర్ ఫుల్ బ్యాటరీ, మంచి బ్రైట్నెస్ అందించ గల 90Hz డిస్ప్లే వంటి చాలా ఆకర్షణీయమైన ఫీచర్లతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ గత సంవత్సరం సాంసంగ్ తీసుకొచ్చిన గెలాక్సీ ఎం11 యొక్క నెక్స్ట్ జెనరేషన్ ఫోనుగా అందించింది.   

సాంసంగ్ గెలాక్సీ M12: ధర

సాంసంగ్ గెలాక్సీ M12 స్టార్టింగ్ వేరియాయంట్ 4జీబీ మరియు 64జీబీ స్టోరేజ్ తో రూ.10,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క మరొక వేరియంట్ ను 6జీబీ మరియు 128జీబీ స్టోరేజ్ తో రూ.13,499 రూపాయల ధరతో లాంచ్ చేసింది. గెలాక్సీ M12 మార్చి 18 నుండి అమెజాన్, సాంసంగ్ అధికారిక వెబ్సైట్ మరియు ఆఫ్ లైన్ మార్కెట్లో నుండి కూడా అందుబాటులో ఉంటుంది.                      

సాంసంగ్ గెలాక్సీ ఎం12: స్పెషిఫికేషన్స్

సాంసంగ్ గెలాక్సీ ఎం12 ఒక 6.5 అంగుళాల HD+ డిస్ప్లేతో ఉంటుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ తో వాటర్ డ్రాప్ నోచ్ తో వస్తుంది గెలాక్సీ M12 Exynos 850 చిప్ సెట్ తో వస్తుంది. ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు మాలీ-G52 GPU తో పనిచేస్తుంది. దీనికి జతగా 4జీబీ/6జీబీ ర్యామ్ మరియు 128జీబీ వరకూ ఇంటర్నల్ స్టోరేజ్ తో లభిస్తుంది. ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది మరియు One UI 3.1 స్కిన్ తో వుంటుంది.

కెమెరాల పరంగా, ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. ఇందులో, 48ఎంపీ మైన్ కెమెరా, 5ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సార్ మరియు 2ఎంపీ మ్యాక్రో సెన్సార్ లను కలిగి ఉంటుంది. ఇక సెల్ఫీల కోసం 8ఎంపీ సెల్ఫీ కెమెరాని ఫోన్ ముందు భాగంలో అందించింది. సెక్యూరిటీ కోసం ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా అందించింది. ఇందులో, పెద్ద 6000 mAh బ్యాటరీని 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది.    

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :