108MP కెమెరాతో వస్తున్న Samsung Galaxy M53 5G స్మార్ట్ ఫోన్..!!

HIGHLIGHTS

శామ్సంగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy M53 5G

గెలాక్సీ M53 5G ప్రస్తుతం శామ్సంగ్ మొబైల్ ప్రెస్ వెబ్సైట్లో జాబితా చేయబడింది

ఈ ఫోన్ యొక్క కీలకమైన వివరాలను కూడా వెల్లడించింది

శామ్సంగ్ తన లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోనుగా Samsung Galaxy M53 5G ని విడుదల చెయ్యడానికి సిద్ధమవుతోంది. శామ్సంగ్ ఈ సంవత్సరం M సిరీస్ నుండి చాలా వేగంగా ఫోన్లను ప్రకటిస్తునట్లు కనిపిస్తోంది. అదే వరుసలో శామ్సంగ్ గెలాక్సీ M53 2022 లో M సిరీస్ యొక్క 3వ స్మార్ట్ ఫోన్ అవుతుంది. ఈ గెలాక్సీ M53 5G ప్రస్తుతం శామ్సంగ్ మొబైల్ ప్రెస్ వెబ్సైట్లో జాబితా చేయబడింది. ఇందులో ఈ ఫోన్ యొక్క కీలకమైన వివరాలను కూడా వెల్లడించింది. గెలాక్సీ ఎం53 5జి స్మార్ట్ ఫోన్ 108MP భారీ కెమెరా సెటప్, వేగవంతమైన 5G ప్రోసెసర్ మరియు 120Hz సూపర్ AMOLED డిస్ప్లే వంటి భారీ ప్రత్యేకతలను కలిగివుంది. ఇంకెందుకు ఆలశ్యం ఈ అప్ కమింగ్ శామ్సంగ్ 5G స్మార్ట్ ఫోన్ గురించి అన్ని వివరాలను తెలుసుకుందాం పదండి.     

Samsung Galaxy M53 5G:స్పెక్స్

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి ఆన్లైన్ లో రివీల్ చేసిన స్పెక్స్ విషయానికి వస్తే, గెలాక్సీ ఎం53 5జి స్మార్ట్ ఫోన్ లో ఇన్ఫినిటీ-0 కటౌట్ కలిగిన 6.7- ఇంచ్ Super AMOELD డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో ఎటువంటి ప్రాసెసర్ తో వస్తుందనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. కానీ, Dimensity 900 SoC కి జతగా 6GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుందని ఊహస్తున్నారు.

ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh భారీ బ్యాటరీని కలిగివుంటుంది. ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరాను ఇన్ఫినిటీ-0 కటౌట్ లో కలిగివుంటుంది. అలాగే, 108MP ప్రధాన సెన్సార్, 8MP అల్ట్రావైడ్, 2MP డెప్త్ సెన్సార్ మరియు 2MP మాక్రో సెన్సార్ కలిగిన క్వాడ్ రియర్ కెమెరా మాడ్యూల్‌ను వుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా One UI 4.1 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :