samsung premium phone available at half price on flipkart latest sale
Flipkart Sale నుంచి ఈరోజు Samsung ప్రీమియం ఫోన్ సగం ధరకే లభిస్తోంది. దీపావళి 2024 సేల్ ముగిసిన తర్వాత ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన Smartphone Festive Days సేల్ నుంచి ఈ డీల్ ను అందించింది. శామ్సంగ్ గెలాక్సీ S సిరీస్ యొక్క లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ ఈ బిగ్ డీల్ ను అందించింది. ఈ సేల్ రేపటితో ముగుస్తుంది కాబట్టి ఈ అవకాశం కేవలం రేపటి వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుందని గుర్తుంచుకోండి.
శామ్సంగ్ Galaxy S సిరీస్ నుంచి గత సంవత్సరం విడుదలైన Galaxy S23 5G స్మార్ట్ ఫోన్ పై ఈ డీల్ ను ఫ్లిప్ కార్ట్ అందించింది. ఇండియన్ మార్కెట్లో రూ. 74,999 రూపాయల ప్రారంభ ధరలో విడుదలైన ఈ ఫోన్ ఈరోజు రూ. 35,999 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 39,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది.
అదనంగా, ఈ ఫోన్ ను Flipkart Axis Bank క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే యూజర్లకు 5% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్ తో ఈ ఫోన్ ను మరింత తక్కువ ధరకు అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది.
Also Read: WhatsApp Upcoming ఫీచర్ తో షేర్డ్ ఇమేజ్ లను వెబ్ పై నేరుగా సెర్చ్ చేసే అవకాశం.!
ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Gen 2 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 50MP + 10MP + 12MP ప్రీమియం ట్రిపుల్ రియర్ మరియు 12MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ తో 8K రిజల్యూషన్ వీడియోలు మరియు అద్భుతమైన ఫోటోలు అందుకోవచ్చు.
ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ 6.1 ఇంచ్ Dynamic AMOLED 2X స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గొప్ప బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ AI సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 3900 mAh బ్యాటరీని ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.