Samsung Galaxy M17 5G బడ్జెట్ ధరలో నో షేక్ కెమెరాతో లాంచ్ అయ్యింది.!

Updated on 10-Oct-2025
HIGHLIGHTS

Samsung Launches Galaxy M17 5G స్మార్ట్ ఫోన్ రోజు ఇండియాలో లాంచ్ అయ్యింది

శాంసంగ్ ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో నో షేక్ కెమెరాతో లాంచ్ చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ మరియు మరిన్ని ఫీచర్స్ తో కేవలం బడ్జెట్ లాంచ్ అయ్యింది

Samsung Galaxy M17 5G స్మార్ట్ ఫోన్ రోజు ఇండియాలో లాంచ్ అయ్యింది. శాంసంగ్ ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో నో షేక్ కెమెరాతో లాంచ్ చేసింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ మరియు మరిన్ని ఫీచర్స్ తో కేవలం బడ్జెట్ లాంచ్ అయ్యింది. ఇండియన్ మార్కెట్లో శాంసంగ్ సరికొత్తగా విడుదల చేసిన ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ పూర్తిగా తెలుసుకోండి.

Samsung Galaxy M17 5G : ప్రైస్

శాంసంగ్ ఈ స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్స్ లో విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క బేసిక్ 4 జీబీ + 128 జీబీ వేరియంట్ రూ. 12,499 ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క 6 జీబీ + 128 జీబీ మిడ్ వేరియంట్ రూ. 13,999 ధరతో మరియు 8 జీబీ + 12 జీబీ హై ఎండ్ వేరియంట్ ని రూ. 15,499 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ పై రూ. 500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఫోన్ అక్టోబర్ 13వ తేదీ నుంచి అమెజాన్ మరియు శాంసంగ్ అధికారిక సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Also Read: BSNL 5G త్వరలో లాంచ్ కావచ్చు: IMC 2025 నుండి కొత్త అప్‌డేట్ వచ్చింది.!

Samsung Galaxy M17 5G : ఫీచర్స్

శాంసంగ్ గెలాక్సీ M17 5జి స్మార్ట్ ఫోన్ కేవలం 7.5mm స్లీక్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో ప్రీమియం డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్ 6.7 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ విక్టస్ గ్లాస్ రక్షణ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ స్క్రీన్ FH+ రిజల్యూషన్ మరియు 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ శాంసంగ్ Exynos 1330 6nm చిప్ సెట్ కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 50MP OIS ప్రధాన సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ AI కెమెరా ఫీచర్ మరియు శాంసంగ్ కెమెరా ఫిల్టర్లు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీ మరియు 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP54 రేటింగ్ డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :