శామ్సంగ్ గెలాక్సీ M13 సిరీస్ నుండి రెండు కొత్త ఫోన్లు బడ్జెట్ ధరలో లాంచ్..!!

HIGHLIGHTS

శామ్సంగ్ తన గెలాక్సీ M13 సిరీస్ నుండి రెండు కొత్త ఫోన్లు బడ్జెట్ ధరలో ఈరోజు లాంచ్ చేసింది

శామ్సంగ్ గెలాక్సీ M13 4G మోడల్ మరియు గెలాక్సీ M13 5G మోడల్ రెండు ఫోన్లు ఉన్నాయి

గెలాక్సీ M13 5G స్టార్టింగ్ వేరియంట్ 4జీబీ మరియు 64జీబీ స్టోరేజ్ ధర రూ.13,999

శామ్సంగ్ తన గెలాక్సీ M13 సిరీస్ నుండి రెండు కొత్త ఫోన్లు బడ్జెట్ ధరలో ఈరోజు లాంచ్ చేసింది, వీటిలో శామ్సంగ్ గెలాక్సీ M13 4G మోడల్ మరియు గెలాక్సీ M13 5G మోడల్ రెండు ఫోన్లు ఉన్నాయి. ఈ రెండు ఫోన్లలో కూడా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. అయితే, ఈ రెండు ఫోన్లను కూడా 15 వేల సబ్ కేటగిరిలో అందించడం విశేషం. మరి శామ్సంగ్ ఈరోజు ఇండియాలో కొత్తగా విడుదల చేసిన గెలాక్సీ M13 సిరీస్ స్మార్ట్ ఫోన్ల ధర, స్పెక్స్ మరియు అన్ని వివరాలను తెలుసుకోండి.           

శామ్సంగ్ గెలాక్సీ M13 సిరీస్: ధరలు

శామ్సంగ్ గెలాక్సీ M13 4G స్టార్టింగ్ వేరియంట్ 4జీబీ మరియు 64జీబీ స్టోరేజ్ తో రూ.11,999 రూపాయల ధరతో మార్కెట్లోకి వచ్చింది. అయితే, శామ్సంగ్ గెలాక్సీ M13 5G స్టార్టింగ్ వేరియంట్ 4జీబీ మరియు 64జీబీ స్టోరేజ్ ధర రూ.13,999. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా జూలై 23 నుండి సేల్ కి అందుబాటలోకి వస్తాయి.  ఈ ఫోన్లను అమెజాన్, Samsung.com మరియు అన్ని ప్రధాన స్టోర్ లలో లభిస్తాయి. ఈ ఫోన్ల పైన లాంచ్ అఫర్ ను కూడా శామ్సంగ్. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఈ ఫోన్లను కొనే వారికి 1,000 రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది.  

శామ్సంగ్ గెలాక్సీ ఎం13 4G: స్పెషిఫికేషన్స్

శామ్సంగ్ గెలాక్సీ M13 4G స్మార్ట్ ఫోన్ ఇన్ఫినిటీ-v నోచ్ కలిగిన 6.6- ఇంచ్ LCD డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ తో కలిగివుంది. ఈ ఫోన్ శామ్సంగ్ యొక్క సొంత ప్రాసెసర్ Exynos 850 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 6,000 mAh భారీ బ్యాటరీని కూడా కలిగివుంటుంది. అలాగే, ఫోన్ వేగంవంతంగా పనిచేయడానికి వీలుగా ర్యామ్ ప్లస్ ఫీచర్ ను కూడా కలిగివున్నట్లు శామ్సంగ్ తెలిపింది.

కెమెరాల విషయానికి వస్తే, ఇందులో 8MP సెల్ఫీ కెమెరాను ఇన్ఫినిటీ-v కటౌట్ లో అందించింది. అలాగే, 50MP ప్రధాన సెన్సార్, 5MP అల్ట్రావైడ్ సెన్సార్ మరియు 2MP డెప్త్ సెన్సార్ లను కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరాను కలిగివుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా One UI 4.1 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ M13 5G: స్పెక్స్

శామ్సంగ్ గెలాక్సీ M13 5G స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ 5G చిప్ సెట్ Dimensity 700 శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ కూడా ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది మరియు One UI 3.1 స్కిన్ తో వుంటుంది.

కెమెరాల పరంగా, ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. ఇందులో, 50ఎంపీ మైన్ కెమెరాకి జతగా డెప్త్ కెమెరా ఉంటుంది.  ఇక సెల్ఫీల కోసం ఈ ఫోన్ ముందు భాగంలో సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్  5000 mAh బ్యాటరీని 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.    

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :