Samsung గుడ్ న్యూస్: ముందు కొనండి తరువాత చెల్లించండి అప్షన్ తో స్మార్ట్ ఫోన్లు.!

HIGHLIGHTS

‘Buy Now, Pay Later’ అప్షన్ ప్రకటించి శామ్సంగ్

శామ్సంగ్ ఫోన్లను చాలా ఈజీగా పొందేలా కొత్త అప్షన్ ను తీసుకువచ్చింది

భారతదేశంలోని రిటైల్ అవుట్‌ లెట్‌ లలో పొందవచ్చు

అత్యంత విశ్వసనీయమైన ప్రముఖ బ్రాండ్ Samsung, కస్టమర్లు శామ్సంగ్ ఫోన్లను చాలా ఈజీగా పొందేలా కొత్త అప్షన్ ను తీసుకువచ్చింది. అదే, ‘Buy Now, Pay Later’ అప్షన్ మరియు ఈ అప్షన్ తో చాలా సులభంగా శామ్సంగ్ స్మార్ట్ ఫోన్లను అందుకునే వీలు కల్పించింది. ఈ ఆఫర్ ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌ లకు అందుబాటులో ఉంది మరియు భారతదేశంలోని రిటైల్ అవుట్‌ లెట్‌ లలో పొందవచ్చు.

ఈ Buy Now, Pay Later’ అప్షన్ తో కస్టమర్లు ఫోన్ పూర్తి అమౌంట్ లో 60% మొత్తాన్ని 18 నెలల సులభ వాయిదాల్లో చెల్లించాలి. ఇక మిగిలిన 40% మొత్తాన్ని 19  వాయిదాలో ఒక్కసారే చెల్లించవలసి ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, 1.5 లక్షల రూపాయల మినిమమ్ క్రెడిట్ లిమిట్ కలిగి ఉన్న కస్టమర్స్ మాత్రమే ఈ ఆఫర్‌కు అర్హులు. దీనికి కారణం ఏమిటంటే, కేవలం ప్రీమియం స్మార్ట్ ఫోన్ల మాత్రమే శామ్సంగ్ ఈ ముందు కొనండి తరువాత చెల్లించండి అప్షన్ ను అందించింది.

ICICI బై నౌ పే లేటర్ ఆఫర్‌తో Galaxy S22 Ultra 5G ని కొనుగోలు చేసే వినియోగదారులు రూ.2999 అఫర్ దరకే Galaxy Watch4 ని పొందవచ్చు మరియు Galaxy S22+ 5G లేదా Galaxy S22 5G ని కొనుగోలు చేసే వారు Galaxy Buds2 ని కేవలం 2,999 ధరకే పొందగలరు.  ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్లు డైనమిక్ AMOLED 2X డిస్ప్లే, Qualcomm Snapdragon 8 Gen 1 ప్రాసెసర్ మరియు డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ (IP68) వంటి గొప్ప ఫీచర్లతో వస్తాయి. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :