శామ్సంగ్ గెలాక్సీ M30 ఒక ట్రిపుల్ రియర్ కెమేరాతో, ఈ రోజు విడుదలకానుంది

Updated on 27-Feb-2019
HIGHLIGHTS

M సిరీస్ నుండి మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అందించనున్న శామ్సంగ్

ప్రస్తుతం, శామ్సంగ్ మంచి ఫామ్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే, శామ్సంగ్ తన స్మార్ట్ ఫోన్లతో ఇండియన్ మార్కెట్ ను ముంచెత్తుతోంది. ముందుగా, శామ్సంగ్  తన గెలాక్సీ M సిరీస్ నుండి గెలాక్సీ M10 మరియు గెలాక్సీ M20 స్మార్ట్ర్ ఫోన్లను గొప్ప ఫీచర్లతో అత్యంత సరసమైన ధరలో తీసుకువచ్చింది. ఇదే భాటలో ఇప్పుడు ఇదే సిరీస్ నుండి మరోక స్మార్ట్ ఫోన్ అయినటువంటి, గెలాక్సీ M30 ని ఈరోజు సాయంత్రం 6 గంటలకి విడుదల చెయ్యనుంది. దీని గురించి, ఒక వెబ్ పేజీని కూడా ఇప్పటికే అమేజాన్ ఇండియా తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన అందించింది. తన M సిరీస్ నుండి సరసమైన ధరలో స్మార్ట్ ఫోన్లను ఇండియాలో అందించనున్నదని ముందుగానే ప్రకటించిది, కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ కూడా 15,000 రూపాయల కంటే తక్కువ ధరతో విడుదలకావచ్చని అంచనావేస్తున్నారు.

శామ్సంగ్ గెలాక్సీ M30 ప్రత్యేకతలు

శామ్సంగ్ ఏ స్మార్ట్ ఫోనుకు సంబందించి కొన్నిస్పెసిఫికేషన్లను ఆన్లైన్లో విడుదల చేసింది. వీటి ప్రకారంగా, ఈ  గెలాక్సీ M30 స్మార్ట్ ఫోన్ 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.4 అంగుళాల సూపర్ AMOLED ఇన్ఫినిటీ – U డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ముందుగా వచ్చిన గెలాక్సీ M20 వలెనే ఇది కూడా ఒక ఎక్సినోస్ 7904 ప్రొసెసరుతో రానున్నట్లు అంచనా వస్తున్నారు. ఎందుకంటే, ఈ ప్రాసెసర్ ఒక ట్రిపుల్ కెమేరాకి మద్దతు ఇవ్వగల ప్రాసెసర్ కాబట్టి ఇది సాధ్యంకావచ్చు.

అలాగే, ఇది 4GB ర్యామ్ జతగా 64GB వేరియంట్ మరియు మరొక 6GB ర్యామ్ జతగా 128GB వేరియంట్లతో విడుదల కావచ్చని కూడా అంచనా వస్తున్నారు.  ఎందుకంటే, ముందుగా M సిరీస్ నుండి వచ్చిన ర్డు స్మార్ట్ ఫోన్లు కూడా రెండు వేరియంట్లను కలిగివున్నాయి, అదికూడా వీటిని ఒక సీక్వెన్స్ లో   ఇచ్చింది, గెలాక్సీ M10 2GB/3GB ర్యామ్ వేరియంట్లలో మరియు గెలాక్సీ M20 3GB/4GB ర్యామ్ తో వచ్చాయి, కాబట్టి ఇది సాధ్యంకావచ్చు.                

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :