Samsung Galaxy Z Fold 7 launched with snapdragon elite chipset
Samsung Galaxy Z Fold 7: శామ్సంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ ఫోల్డ్ సిరీస్ నుంచి ఈరోజు జెడ్ ఫోల్డ్ 7 ఫోన్ ను విడుదల చేసింది. ఈ కొత్త ఫోల్డ్ ఫోన్ ను Snapdragon 8 Elite పవర్ ఫుల్ చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ సూపర్ కెమెరా మరియు గొప్ప స్లీక్ డిజైన్ తో కూడా వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏమిటో తెలుసుకుందామా.
శామ్సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 ఫోన్ ను మధ్యకు మడతపెట్టే 8 ఇంచ్ స్క్రీన్ మరియు 6.5 ఇంచ్ అవుటర్ స్క్రీన్ తో లాంచ్ చేసింది. ఇందులో రెండు స్క్రీన్లు కూడా Dynamic AMOLED 2X తో అందించింది. వీటిలో మడతపెట్టే మెయిన్ స్క్రీన్ QXGA+ రిజల్యూషన్ మరియు అవుటర్ స్క్రీన్ FHD+ రిజల్యూషన్ కలిగి ఉంటాయి. ఈ రెండు స్క్రీన్లు కూడా 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ను కూడా కలిగి ఉంటాయి.
ఈ ఫోన్ మడత పెట్టినప్పుడు 8.2mm మందంతో, మడత విప్పినప్పుడు కేవలం 4.2mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది. ఈ ఫోన్ కవర్ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2 రక్షణతో ఉంటుంది. ఈ ఫోన్ బ్యాక్ కవర్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణతో ఉంటుంది. ఈ ఫోన్ ను ఫ్రేమ్ ను అడ్వాన్స్డ్ ఆర్మ అల్యూమినియం ఫ్రేమ్ తో అందించింది.
గెలాక్సీ Z ఫోల్డ్ 7 ఫోన్ ను క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ Snapdragon 8 Elite తో లాంచ్ చేసింది. ఈ చిప్ సెట్ కి జతగా 16 జీబీ ర్యామ్ మరియు 1TB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ అందించింది. ఈ లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ OneUI 8 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 16 OS తో పని చేస్తుంది.
ఈ ఫోన్ లో జబర్దస్త్ కెమెరా సెటప్ అందించింది. ఇందులో, 200MP వైడ్ యాంగిల్ కెమెరా, 10MP మెయిన్, 12MP అల్ట్రా వైడ్ మరియు 10MP టెలిఫోటో కలిగిన రియర్ కెమెరా మరియు 10MP సెల్ఫీ కెమెరాను అందించింది. ఈ ఫోన్ 30x స్పేస్ జూమ్, 3x ఆప్టికల్ జూమ్ మరియు AI సూపర్ రిజల్యూషన్ తో 10x డిజిటల్ జూమ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ 4,400mAh డ్యూయల్ బ్యాటరీతో అందించింది మరియు ఇది 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్, ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు వైర్లెస్ పవర్ షేర్ సపోర్ట్ తో కూడా అందించింది.
Also Read: ఈరోజు చవక ధరలో కొత్త QLED స్పెషల్ ఎడిషన్ Smart TV లను లాంచ్ చేసిన Kodak
ఈ ఫోన్ ను శామ్సంగ్ మూడు వేరియంట్స్ లో అందించింది. ఈ మూడు వేరియంట్ ప్రైస్ వివరాలు ఈ క్రింద చూడవచ్చు.
శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 (12 జీబీ + 256 జీబీ) ధర : రూ. 1,74,999
శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 (12 జీబీ + 512 జీబీ) ధర : రూ. 1,86,999
శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 (16 జీబీ + 1 టీబీ) ధర : రూ. 2,10,999
ఈ ఫోన్ ను బ్లాక్ షాడో, సిల్వర్ షాడో మరియు జెట్ బ్లాక్ మూడు రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ ఈరోజు నుంచి ప్రీ- ఆర్డర్ లకు అందుబాటులోకి వచ్చింది. జూలై 12వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ కి కూడా అందుబాటులోకి వస్తుందని శామ్సంగ్ తెలిపింది. అయితే, ఈ ఫోన్ ను ప్రీ ఆర్డర్ లో భాగంగా గొప్ప డీల్ అందించింది.
డీల్ ఏమిటంటే, ఈరోజు నుంచి 12వ తేదీ లోపు ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ చేసే వారికి కేవలం బేసిక్ వేరియంట్ దగరకే 12 జీబీ + 512 జీబీ వేరియంట్ అందుకోవచ్చని శామ్సంగ్ ప్రకటించింది.