Rs. 6,000 ధర తగ్గిన Samsung Galaxy S9 Plus
ప్రస్తుతం ఈ ధరలు ఆఫ్లైన్ మార్కెట్ లో తగ్గించబడ్డాయి
గెలాక్సీ S10 స్మార్ట్ ఫోన్ ఎంట్రీ కోసం శామ్సంగ్ యొక్క గెలాక్సీ ఎస్ 9 ప్లస్ ధరలను తగ్గించింది. ప్రస్తుతం ఈ ధరలు ఆఫ్లైన్ మార్కెట్ లో తగ్గించబడ్డాయి. నివేదిక ప్రకారం, స్మార్ట్ ఫోను యొక్క మూడు వేరియంట్ల ధరలు రూ .6,000 వరకు తగ్గించబడ్డాయి.
Survey91 మోబైల్స్ నివేదిక ప్రకారం, గెలాక్సీ S9 ప్లస్ 64GB వేరియంట్ ధర ఆఫ్లైన్ స్టోరులో రూ. 57,900 కు తగ్గించబడింది, అయితే ఈ ఫోన్ యొక్క మునుపటి ధర రూ .63,900 రూపాయలుగా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 128GB మోడల్ ప్రస్తుతం రూ. 67,900 నుంచి 61,900 రూపాయలకు తగ్గింది. అలాగే, 256 GB వేరియంట్ గురించి చూస్తే, ఇది ఆఫ్లైన్ స్టోర్లో 65,900 రూపాయల వద్ద విక్రయించబడుతోంది, గత ధర రూ. 71,900 రూపాయలుగా వుంది.
ఈ ప్రైస్ కట్, ఆఫ్లైన్ దుకాణాలకు మాత్రమే జరుగుతుంది, కానీ కొన్ని వేరియంట్లు అమెజాన్ ఇండియా మరియు ఫ్లిప్ కార్ట్ లో కూడా జాబితా చేయబడ్డాయి. గెలాక్సీ S9 ప్లస్ 64GB వేరియంట్ ఫ్లిప్ కార్ట్ ధర రూ. 57,899 మరియు గెలాక్సీ S9 ప్లస్ 256GB వేరియంట్ 65,349 రూపాయలకు అందుబాటులో ఉంది.
అయినప్పటికీ, ఆఫ్లైన్ విఫణి ధరల కంటే అధికమైన ధరతో కొన్ని వేరియంట్లు ఆన్లైన్ లో జాబితా చేయబడ్డాయి. మీరు ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనీ ఎదురుచూస్తున్నట్లైతే, ముందుగా ధరలను సరిపోల్చి చూసి మాత్రమే కొనుగోలు చేయండి.ఎందుకంటే, 6,000 రూపాయల తక్కువ ధరకి ఈ ఫోన్ మీరు సొంతం చేసుకోవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile