Samsung Galaxy S26 Plus: ఫ్లాగ్‌ షిప్ ఫీచర్స్ తో ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్ గా వచ్చింది.!

HIGHLIGHTS

గెలాక్సీ ఎస్ 26 నుంచి ఈరోజు ఫ్లాగ్‌షిప్ ఫీచర్స్ తో శాంసంగ్ గెలాక్సీ 26 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది

Samsung Galaxy S26 Plus లేటెస్ట్ డిజైన్ మరియు స్టన్నింగ్ ఫ్యూచర్స్ తో వచ్చింది

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 26 ప్లస్ ఫోన్ బిగ్ బ్యాటరీ కలిగి కేవలం 7.2mm అల్ట్రా స్లీక్ డిజైన్ తో ఉంటుంది

Samsung Galaxy S26 Plus: శాంసంగ్ ఫ్లాగ్‌ షిప్ సిరీస్ గెలాక్సీ ఎస్ 26 నుంచి ఈరోజు ఫ్లాగ్‌ షిప్ ఫీచర్స్ తో శాంసంగ్ గెలాక్సీ 26 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ సిరీస్ నుంచి అందించిన మూడు స్మార్ట్ ఫోన్ లలో ఇది మిడిల్ ఫోన్ గా వచ్చింది. గెలాక్సీ 26 స్మార్ట్ ఫోన్ కలిగిన లేటెస్ట్ డిజైన్ మరియు స్టన్నింగ్ ఫ్యూచర్స్ ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్ గా మార్కెట్ లో అడుగు పెట్టింది. మరి సరికొత్తగా శాంసంగ్ విడుదల చేసిన గెలాక్సీ ఎస్ 26 ఎలా ఉందో ఒక లుక్కేద్దామా.

Samsung Galaxy S26 Plus: ఫీచర్స్

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 26 ప్లస్ ఫోన్ బిగ్ బ్యాటరీ కలిగి కేవలం 7.2mm అల్ట్రా స్లీక్ డిజైన్ తో ఉంటుంది. ఈ శాంసంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ బిగ్ డైనమిక్ AMOLED 2X డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఈ ఫోన్ మంచి విజువల్స్ కోసం విజన్ బూస్టర్ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు FHD+ రిజల్యూషన్ అండ్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ శాంసంగ్ యొక్క లేటెస్ట్ చిప్ సెట్ Exynos 2600 తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 12 జీబీ ర్యామ్ మరియు 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటుంది.

ఈ శాంసంగ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP వైడ్, 12MP అల్ట్రా వైడ్ మరియు 10MP (3x ఆప్టికల్ జూమ్) టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్ ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 24FPS 8K రికార్డింగ్, 60FPS 4K రికార్డింగ్ సపోర్ట్ తో వస్తుంది. అంతేకాదు, ఈ లేటెస్ట్ గెలాక్సీ ఫోన్ AI కెమెరా ఫీచర్స్ మరియు శాంసంగ్ కెమెరా ఫిల్టర్లు కూడా కలిగి ఉంటుంది. IP 68 రేటింగ్ తో ఈ ఫోన్ గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సెటప్ తో ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 26 ప్లస్ స్మార్ట్ ఫోన్ 4,900 mAh  బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వేగవంతమైన 25W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్, ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ 2.0 మరియు వైర్లెస్ పవర్ షేర్ వంటి చార్జింగ్ ఫీచర్స్ తో వస్తుంది.

Also Read: Samsung Galaxy S26 : ఆల్ న్యూ ఫీచర్స్ తో విడుదలైన గెలాక్సీ ఎస్ 26 ఫోన్.!

Samsung Galaxy S26 Plus: ప్రైస్

శాంసంగ్ ఈ గెలాక్సీ ఎస్ 26 ఫోన్ ను రెండు వేరియంట్లలో అందించింది.

శాంసంగ్ లేటెస్ట్ గెలాక్సీ ఎస్ 26 ప్లస్ (12GB + 256GB) ప్రైస్ : రూ. 1,19,999

శాంసంగ్ లేటెస్ట్ గెలాక్సీ ఎస్ 26 ప్లస్ (12GB + 512GB) ప్రైస్ : రూ. 1,39,999

ఈ స్మార్ట్ ఫోన్ ప్రీ ఆర్డర్ లను కంపెనీ ఈరోజు నుంచి ప్రారంభం చేసింది. అయితే, ఈ ఫోన్ మార్చి 11వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :