Samsung Galaxy S26 : ఆల్ న్యూ ఫీచర్స్ తో విడుదలైన గెలాక్సీ ఎస్ 26 ఫోన్.!

HIGHLIGHTS

శాంసంగ్ ఈరోజు తన ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ గెలాక్సీ S26 సిరీస్ నుంచి కొత్త ఫోన్లు విడుదల చేసింది

శాంసంగ్ గెలాక్సీ 2ఎస్ 26 ఫోన్ ను ఆల్ న్యూ డిజైన్ అండ్ ఫ్యూచర్స్ తో అందించింది

ఈ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్ 26 బేసిక్ వేరియంట్ ఫోన్ అయినా కూడా గొప్ప ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది

Samsung Galaxy S26 : శాంసంగ్ ఈరోజు తన ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ గెలాక్సీ S26 సిరీస్ నుంచి కొత్త ఫోన్లు విడుదల చేసింది. ఈ సిరీస్ నుంచి మూడు కొత్త ఫోన్లు రిలీజ్ చేసింది. వాటిలో స్టాండర్డ్ మోడల్ అయిన శాంసంగ్ గెలాక్సీ S26 ఫోన్ ను ఆల్ న్యూ డిజైన్ అండ్ ఫ్యూచర్స్ తో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్ 26 బేసిక్ వేరియంట్ ఫోన్ అయినా కూడా గొప్ప ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ లేటెస్ట్ శాంసంగ్ ఫోన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.

Samsung Galaxy S26 : ఫీచర్స్

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 26 స్మార్ట్ ఫోన్ ను గొరిల్లా ఆర్మర్ / మొబైల్ గ్లాస్ మరియు మెటల్ ఫ్రేమ్ తో కేవలం 7.2mm అల్ట్రా స్లీక్ డిజైన్ లో అందించింది. ఈ ఫోన్ ను 6.3 ఇంచ్ డైనమిక్ AMOLED 2X స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు విజన్ బూస్టర్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Exynos 2600 చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఇది డెకా కోర్ చిప్ సెట్ మరియు గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ చిప్ సెట్ తో జతగా ఈ ఫోన్ ను మరింత వేగంగా నడిపించే 12 జీబీ ఫాస్ట్ ర్యామ్ మరియు 512 జీబీ అల్ట్రా ఫాస్ట్ స్టోరేజ్ ఈ ఫోన్ లో అందించింది.

ఈ శాంసంగ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 12MP అల్ట్రా వైడ్, 50MP వైడ్ మరియు 10MP టెలిఫోటో కెమెరాలు కలిసిన ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 12MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ మెయిన్ కెమెరా 24FPS తో 8K వీడియో రికార్డింగ్ మరియు 60FPS 4K రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ గెలాక్సీ AI సపోర్ట్ తో గొప్ప ఏఐ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP 68 రేటింగ్ కలిగి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.

ఈ ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 4,300 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 25W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ మరియు ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ 2.0 సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఇది కాకుండా శాంసంగ్ గెలాక్సీ ఎస్ 26 స్మార్ట్ ఫోన్ వైర్లెస్ పవర్ షేర్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.

Also Read: Realme C83 5G: అతి భారీ బ్యాటరీతో బడ్జెట్ ఫోన్ లాంచ్ చేస్తున్న రియల్‌మీ

Samsung Galaxy S26 : ప్రైస్

శాంసంగ్ లేటెస్ట్ గెలాక్సీ ఎస్ 26 స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్స్ లాంచ్ చేసింది. ఈ ప్రైస్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

శాంసంగ్ లేటెస్ట్ గెలాక్సీ ఎస్ 26 (12GB + 256GB) ప్రైస్ : రూ. 89,999

శాంసంగ్ లేటెస్ట్ గెలాక్సీ ఎస్ 26 (12GB + 512GB) ప్రైస్ : రూ. 1,07,999

ఈరోజు నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ప్రీ ఆర్డర్ స్టార్ట్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ పై లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఫోన్ 12GB + 512GB వేరియంట్ ను ప్రస్తుతం బుక్ చేసుకుంటే రూ. 89,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుందని కంపెనీ అనౌన్స్ చేసింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :