Samsung Galaxy S24 Ultra now available with 35k big discount on amazon
Samsung Galaxy S24 Ultra: శామ్సంగ్ పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ సిరీస్ S సిరీస్ యొక్క హై ఎండ్ ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. అదే, శామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా మరియు ఈ ఫోన్ ఇప్పుడు అమెజాన్ ఇండియా నుంచి 35 వేల రూపాయల భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ కలిగిన అద్భుతమైన ఫీచర్స్ మరియు కెమెరా తో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రస్తుతం మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో తక్కువ ధరలో అందుకోవచ్చు.
శామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రూ. 1,29,999 రూపాయాల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు అమెజాన్ నుంచి 35 వేల రూపాయల భారీ తగ్గింపు అందుకుని రూ. 94,499 రూపాయల డిస్కౌంట్ ధరతో సేల్ అవుతోంది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసే ప్రైమ్ మెంబర్స్ కు రూ. 4,724 వరకు క్యాష్ బ్యాక్ అందుకు ఛాన్స్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను 90 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే పొందే అవకాశం అమెజాన్ అందించింది. Buy From Here
శామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ఇదే సిరీస్ నుంచి వచ్చిన ఫోన్స్ కంటే కొంచెం స్లీక్ గా ఉంటుంది. ఈ ఫోన్ లో 200 MP వైడ్ + 50 MP పెరిస్కోప్ + 12 MP అల్ట్రా వైడ్ + 10 MP టెలిఫోటో సెన్సార్ లతో పవర్ ఫుల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా 4K మరియు 8K వీడియో రికార్డ్ సపోర్ట్ తో పాటు సూపర్ రిజల్యూషన్ జూమ్ సపోర్ట్ తో కూడా వస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Gen 3 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు జతగా 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఇన్ బిల్ట్ S పెన్ మరియు AI సపోర్ట్ తో గొప్ప అనుభూతిని అందిస్తుంది మరియు ఇతర ఫోన్ లతో ఈ ఫోన్ ను వేరు చేస్తుంది.
Also Read: Noise Air buds Pro 6 ఇయర్ బడ్స్ ను డ్యూయల్ స్పీకర్ మరియు LHDC తో లాంచ్ చేస్తోంది.!
ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ 6.8 ఇంచ్ డైనమిక్ AMOLED 2X స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ ఆర్మర్ గ్లాస్ ప్రొటక్షన్, 120Hz రిఫ్రెష్ రేట్, QHD+ రిజల్యూషన్ మరియు గరిష్టమైన బ్రైట్నెస్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 5000 mAh బ్యాటరీ, 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్, 15W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ మరియు 4.5W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.