Samsung Galaxy S24 FE now available at lowest price ever
Samsung Galaxy S24 FE స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఎన్నడూ చూడనంత చవక ధరకు లభిస్తోంది. అమెజాన్ ఇండియా ఈ ఫోన్ పై అందించిన భారీ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ శామ్సంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఇప్పుడు 35 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రీమియం చిప్ సెట్, కెమెరా మరియు డిస్ప్లేతో ఆకట్టుకుంటుంది.
శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 24 FE స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రూ. 59,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ ఇప్పుడు అమెజాన్ నుంచి భారీ డిస్కౌంట్ అందుకుంది. ఈ ఫోన్ ఇప్పుడు అమెజాన్ ఇండియా నుంచి రూ. 22,500 రూపాయల భారీ తగ్గింపు అందుకుని రూ. 37,499 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ శామ్సంగ్ అధికారిక వెబ్సైట్ నుంచి రూ. 44,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లిస్ట్ అయ్యింది. ఇలా చూసినా అమెజాన్ నుంచి ఈ ఫోన్ తక్కువ ధరకు లభిస్తుంది.
ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ ఫై అమెజాన్ ఇండియా మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. అదేమిటంటే, ఈ ఫోన్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,500 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 34,999 రూపాయల ధరకే లభిస్తుంది. Buy From Here
ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ శామ్సంగ్ సొంత AI చిప్ సెట్ Exynos 2400e తో వస్తుంది. ఈ చిప్ సెట్ 17 లక్షలకు పైగా AnTuTu స్కోర్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.7 ఇంచ్ డైనమిక్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్, ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది.
గెలాక్సీ ఎస్ 23 FE స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP మెయిన్, 12 MP అల్ట్రా వైడ్ మరియు 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ కలిగిన 8MP టెలిఫోటో కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ముందు 10MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ UHD 8K వీడియోలను 30fps వద్ద రికార్డ్ చేసే సామర్థ్యం మరియు AI కెమెరా సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది.
Also Read: Jio Best Plans: మూడు నెలలు కంప్లీట్ 5G అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందించే బెస్ట్ ప్లాన్స్.!
ఈ శామ్సంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ 4700 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ ఫోన్ అల్యూమినియం ఫ్రేమ్ తో ఉంటుంది మరియు ముందు వెనుక కూడా పటిష్టమైన గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ గ్లాస్ కలిగి ఉంటుంది.