SAMSUNG Galaxy S23 Ultra 5G ప్రైస్ ను భారీగా తగ్గించిన ఫ్లిప్ కార్ట్.!

Updated on 26-Mar-2025
HIGHLIGHTS

SAMSUNG Galaxy S23 Ultra 5G స్మార్ట్ ఫోన్ ధరను ఫ్లిప్ కార్ట్ భారీగా తగ్గించింది

ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 47 వేల రూపాయల భారీ తగ్గింపుతో సేల్ అవుతోంది

ఈ ఫోన్ ప్రీమియం ఫీచర్స్ మరియు ప్రీమియం డిజైన్ తో ఆకట్టుకుంటుంది

SAMSUNG Galaxy S23 Ultra 5G స్మార్ట్ ఫోన్ ధరను ఫ్లిప్ కార్ట్ భారీగా తగ్గించింది. శామ్సంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ గెలాక్సీ S సిరీస్ నుంచి అందించిన ఈ అప్పర్ ప్రీమియం ఫోన్, ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 47 వేల రూపాయల భారీ తగ్గింపుతో సేల్ అవుతోంది. ఈ ఫోన్ ప్రీమియం ఫీచర్స్ మరియు ప్రీమియం డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ ప్రీమియం ఫోను పై ఫ్లిప్ కార్ట్ అందించిన తగ్గింపు మరియు ఫోన్ ఫీచర్స్ తెలుసుకోండి.

SAMSUNG Galaxy S23 Ultra 5G: తగ్గింపు ధర

ఇండియాలో రూ. 1,29,999 ప్రారంభ ధరతో విడుదలైన శామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 47,009 రూపాయల తగ్గింపుతో రూ. 82,990 ఆఫర్ ధరకు సేల్ అవుతోంది. ఈ ఫోన్ ను Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ తో కొనే వారికి 5% క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను మరింత తక్కువ ధరకు పొందవచ్చు.

SAMSUNG Galaxy S23 Ultra 5G: ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Gen 2 ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.8 ఇంచ్ Dynamic AMOLED 2X స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ QHD+ రిజల్యూషన్, 1Hz – 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు గరిష్ట బ్రైట్నెస్ కలిగి ఉంటుంది.

ఈ శామ్సంగ్ ప్రీమియం ఫోన్ 200MP + 10MP + 12MP + 10MP క్వాడ్ రియర్ కెమెరా సెటప్ మరియు ముందు 12MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 100x డిజిటల్ జూమ్, 8K మరియు 4K వీడియో రికార్డ్ సపోర్ట్ మరియు AR Zone తో పాటు Bixby Vision వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Also Read: Airtel IPTV సర్వీస్ లాంచ్ చేసిన ఎయిర్టెల్: ప్లాన్ రేట్లు మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ IP68 రేటింగ్ డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్ తో చాలా పటిష్టమైన డిజైన్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి తగ్గింపు ధరకు పొందవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :