శామ్సంగ్ లేటెస్ట్ ఫోన్ రూ.20,000 డిస్కౌంట్ తో అమెజాన్ సేల్ నుండి లభిస్తోంది.!

HIGHLIGHTS

అమెజాన్ Extra Happiness Days సేల్ నుండి భారీ ఆఫర్లను అనౌన్స్ చేస్తోంది

శామ్సంగ్ లేటెస్ట్ ఫోన్ రూ.20,000 డిస్కౌంట్ అనౌన్స్ చేసి సప్రైజ్ చేసింది

Samsung Galaxy S22 5G అమెజాన్ సేల్ నుండి మంచి ఆఫర్లతో లభిస్తోంది

అమెజాన్ పండుగ సేల్ Extra Happiness Days సేల్ నుండి భారీ ఆఫర్లను అనౌన్స్ చేస్తోంది. ఈ అతిపెద్ద అమెజాన్ సేల్ నుండి శామ్సంగ్ లేటెస్ట్ ఫోన్ రూ.20,000 డిస్కౌంట్ అనౌన్స్ చేసి సప్రైజ్ చేసింది. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్ పైన మరిన్ని ఆఫర్లను కూడా జత చేసింది. ఇంకా చెప్పాలంటే, శామ్సంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ కొనాలని మీరు ఆలోచిస్తున్నట్లయితే, ఈ డీల్ మీకు సదావకాశం గా చెప్పవచ్చు. మరింకెందుకు ఆలశ్యం అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న ఆ బెస్ట్ శామ్సంగ్ ఫోన్ డీల్ చూడండి.                       

శామ్సంగ్ యొక్క ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ అయిన Galaxy S22 సిరీస్‌ లో సరసమైన ఫోన్ Samsung Galaxy S22 5G స్మార్ట్ ఫోన్ అమెజాన్ సేల్ నుండి మంచి ఆఫర్లతో లభిస్తోంది. ఇక ఈ అఫర్ విషయానికి వస్తే, రూ.72,999 ప్రారంభ ధరతో ఈ ఏడాది ప్రారంభంలో ఇండియాలో విడుదలైన ఈ స్మార్ట్‌ ఫోన్, అమెజాన్ సేల్ నుండి రూ.10,000 డిస్కౌంట్ తో కేవలం రూ.62,999 రూపాయలకే లభిస్తోంది. అమెజాన్ ఈ స్మార్ట్‌ ఫోన్‌ పైన రూ.10,000 కూపన్ తగ్గింపును అందిస్తోంది. తద్వారా ఈ ఫోన్ ను 20,000 రూపాయల భారీ డిస్కౌంట్ మీరు పొందవచ్చు. అలాగే, ICICI మరియు Axis బ్యాంక్ కార్డ్స్ తో ఈ ఫోన్ కొనుగోలు చేసే వారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here      

Samsung Galaxy S22 5G: ప్రత్యేకతలు

శామ్సంగ్ గెలాక్సీ ఎస్22 5జి స్మార్ట్ ఫోన్ 6.1 ఇంచ్ AMOLED డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంటుంది.  ఈ Galaxy S22 ఫోన్ వేగవంతమైన పవర్ ఫుల్ 5G మరియు 4nm ప్రోసెసర్ Qualcomm Snapdragon 8 Gen 1 ప్రాసెసర్ కి జతగా 8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.

ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో,50MP ప్రధాన సెన్సార్, 12MP అల్ట్రావైడ్ సెన్సార్, 10MP టెలీ ఫోటో సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ లో ఉన్న కెమెరాతో 8K లో వీడియోలను రికార్డ్ చెయవచ్చు. ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 3,700 mAh బ్యాటరీని కలిగివుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా One UI 4.1 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది మరియు Android 13 OS అప్డేట్ ను వెంటనే అందుకుంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :