Samsung Galaxy M56 5G sale started with big deals from today
Samsung Galaxy M56 5G స్మార్ట్ ఫోన్ గత వారం ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ ను భారీ ఆఫర్స్ తో అందించింది మరియు ఈ ఫోన్ దేశంలో అత్యంత సన్నని ఫోన్ గా లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ధర మరియు ఫీచర్లతో పాటు పూర్తి ప్రత్యేకతలు తెలుసుకోండి.
శామ్సంగ్ గెలాక్సీ M56 5జి స్మార్ట్ ఫోన్ బేసిక్ 8GB + 128GB వేరియంట్ ను రూ. 27,999 ధరతో మరియు 8GB + 256GB వేరియంట్ ను రూ. 30,999 ధరతో లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ పై పై ఆల్ బ్యాంక్ కార్డ్స్ పై రూ. 3,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈ ఫోన్ ఈరోజు నుంచి అమెజాన్ ఇండియా, Samsung అధికారిక సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్ మరియు లైట్ గ్రీన్ రెండు కలర్స్ లో లభిస్తుంది. Buy From Here
ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ అతి సన్నని 7.2 mm మందంతో ఉంటుంది మరియు గొప్ప లుక్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మెటల్ కెమెరా డెకో మరియు గ్లాస్ బ్యాక్ తో గొప్పగా ఆకట్టుకుంటుంది. శామ్సంగ్ గెలాక్సీ ఎం56 5జి స్మార్ట్ ఫోన్ విజన్ బూస్టర్ సపోర్ట్ కలిగిన Super AMOLED+ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 1200 నిట్స్ (HBM) బ్రైట్నెస్, ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు అతి సన్నాయి బెజెల్స్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో 50MP మెయిన్ + 8MP అల్ట్రా వైడ్ + 2MP మ్యాక్రో శేఖర్,కెమెరాలు ఉంటాయి. ఈ ఫోన్ లో 12 MP HDR కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 30fps తో 4K రికార్డింగ్ సపోర్ట్ మరియు AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Also Read: Vu GloQLED స్మార్ టీవీని ఇప్పుడు అమెజాన్ నుంచి తక్కువ ధరకే అందుకోండి.!
ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ Exynos 1480 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ LPDDR5 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ One UI 7.0 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 15OS పై పని చేస్తుంది.