108MP క్వాడ్ కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో వచ్చిన శామ్సంగ్ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్.!

HIGHLIGHTS

Samsung Galaxy M53 5G ఈరోజు ఇండియాలో విడుదలయ్యింది

Galaxy M53 5G ఆకర్షణీయమైన ప్రైస్ ట్యాగ్ తో వచ్చింది

108 MP బిగ్ కెమెరా సెటప్ తో పాటుగా బిగ్ బ్యాటరీ

గత కొంత కాలంగా శామ్సంగ్ టీజింగ్ చేస్తున్న Samsung Galaxy M53 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో విడుదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ వేగవంతమైన 5G, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 108 MP బిగ్ కెమెరా సెటప్ తో పాటుగా బిగ్ బ్యాటరీతో కూడా ఉంటుంది. అంతేకాదు,ఈ శామ్సంగ్ గెలాక్సీ M53 5జి ధర పరంగా కూడా ఆకర్షణీయమైన ప్రైస్ ట్యాగ్ తో వచ్చింది. మరి ఈరోజే ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ శామ్సంగ్ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ గురించి తెలుసుకుందామా.  

Samsung Galaxy M53 5G: స్పెక్స్

శామ్సంగ్ గెలాక్సీ M53 5G స్మార్ట్ ఫోన్ లో ఇన్ఫినిటీ-0 కటౌట్ కలిగిన 6.7- ఇంచ్ Super AMOELD డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఈ ఫోన్ Dimensity 900 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో ఉంటుంది. ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh భారీ బ్యాటరీని కలిగివుంటుంది.

ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరాను ఇన్ఫినిటీ-0 కటౌట్ లో కలిగివుంటుంది. అలాగే, 108MP ప్రధాన సెన్సార్, 8MP అల్ట్రావైడ్, 2MP డెప్త్ సెన్సార్ మరియు 2MP మాక్రో సెన్సార్ కలిగిన క్వాడ్ రియర్ కెమెరా మాడ్యూల్‌ను వుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా One UI 4.1 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది. అలాగే, 2 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు మరియు 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌ లను కూడా ఈ ఫోన్ ద్వారా పొందుతారు.

Samsung Galaxy M53 5G: ధర మరియు ఆఫర్లు

Samsung Galaxy M53 5G యొక్క బేసిక్ వేరియంట్ 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ ధర రూ.23,999 మరియు మరొక వేరియంట్  8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ ధర రూ.25,999. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ ఏప్రిల్ 29 న ప్రారంభమవుతుంది.

ఇక ఆఫర్ల విషయానికి వస్తే, క్రెడిట్ కార్డ్స్ మరియు EMI లావాదేవీలపై రూ.2500 తక్షణ తగ్గింపుతో ICICI బ్యాంక్ సమ్మర్ బొనాంజా ఆఫర్ దీనిపైన అందించింది.           

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :