Samsung Galaxy M52 5G: భారీ ఫీచర్లతో లాంచ్.. రేటు ఎంతంటే..!

HIGHLIGHTS

గెలాక్సీ M సిరీస్ నుండి శాంసంగ్ గెలాక్సీ M52 5G స్మార్ట్ ఫోన్

Snapdragon 778G ఆక్టా కోర్ ప్రోసెసర్

5000mAh బ్యాటరీ మరియు 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

Samsung గెలాక్సీ M సిరీస్ నుండి శాంసంగ్ గెలాక్సీ M52 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు విడుదలయ్యింది. ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ 5G ప్రోసెసర్ Snapdragon 778G ఆక్టా కోర్ ప్రోసెసర్ మరియు 11 5G బ్యాండ్స్ సపోర్ట్ తో వచ్చింది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీ మరియు 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి చాలా బెస్ట్ ఫీచర్లతో విడుదలయ్యింది. మరి ఈ లేటెస్ట్ శాంసంగ్ 5G ఫోన్ గురించి పూర్తి విశేషాలు తెలుసుకుందామా.      

Samsung Galaxy M52 5G: Price

గెలాక్సీ M52 5G స్మార్ట్ ఫోన్ రూ.29,999 రూపాయల ప్రారంభ ధరలో వచ్చింది. ఈ ఫోన్ అమెజాన్, samsung ఆన్లైన్ స్టోర్ మరియు అన్ని ప్రముఖ రిటైల్ షాపుల నుండి లభిస్తుంది. అయితే, అక్టోబర్ 3 వతేది నుండి మొదలవనున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి స్పెషల్ ఇంట్రడక్టరి సేల్ అఫర్ క్రింద కేవలం రూ.29,999 ప్రారంభ ధరలో మరియు మరిన్ని భారీ ఆఫర్లతో లభిస్తుంది.  

Samsung Galaxy M52 5G: స్పెసిఫికేషన్‌లు

ఈ శాంసంగ్ లేటెస్ట్ 5G ఫోన్ 6.7 ఇంచ్ FHD+ ఇన్ఫినిటీ 0 డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన SuperAMOLED డిస్ప్లే. ఈ ఫోన్‌ను అన్నివిధాలా వేగంగా ఉంచడానికి మంచి ప్రోసెసర్ అందించింది. అంటే,  స్పీడ్, గేమింగ్ మరియు మల్టీ టాస్కింగ్ అందించడానికి Snapdragon 778G ఆక్టా కోర్ ప్రోసెసర్ తో ఈ ఫోన్ అందించింది.

ఈ ప్రొసెసర్ 6nm ఫ్యాబ్రికేషన్ తో వస్తుంది మరియు 11 బ్యాండ్స్ వరకూ 5G సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారితమైన OneUI 3.1 స్కిన్ పైన నడుస్తుంది. గెలాక్సీ M52 5G 5000mAh బ్యాటరీతో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగివుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జి స్మార్ట్ ఫోన్ చాలా సన్నని డిజైన్ తో వచ్చింది మరియు వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఈ సెటప్ లో 64ఎంపి ప్రధాన కెమెరా, 12ఎంపి అల్ట్రా వైడ్ కెమెరా మరియు 5ఎంపి మ్యాక్రో కెమెరా లను అందించింది. ఇక ముందుభాగంలో, భారీ 32 ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :