శామ్సంగ్ గత వారం కొత్తగా ప్రకటించిన Samsung Galaxy M33 5G స్మార్ట్ ఫోన్ ఈరోజునుండి మంచి ఆఫర్లతో అమెజాన్ నుండి సేల్ అవుతోంది. ఈ సరికొత్త 5జి స్మార్ట్ ఫోన్ సరసమైన ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చింది. గెలాక్సీ ఎం33 5జి స్మార్ట్ ఫోన్ పైన దాదాపుగా అన్ని ప్రధాన బ్యాంక్ కార్డ్స్ పైన 10% డిస్కౌంట్ ను అఫర్ చేస్తోంది. బ్యాంక్ ఆఫర్ల ద్వారా కొనేవారికి ఈ ఫోన్ పైన గరిష్టంగా 2,000 రూపాయల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. మరి ఈ ఫోన్ ఆపైన అందించిన ఆఫర్లు మరియు ఫోన్ కంప్లీట్ ఫీచర్ల వివరాలను గురించి తెలుసుకుందామా.
ప్రస్తుతం, ఇంట్రడక్టరి అఫర్ క్రింద శామ్సంగ్ గెలాక్సీ ఎం33 5జి స్మార్ట్ ఫోన్ యొక్క స్టార్టింగ్ వేరియంట్ 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ ధర రూ.17,999 మరియు 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,499. ( Buy From Here )
ఆఫర్స్: ఈ స్మార్ట్ ఫోన్ ను ICICI బ్యాంక్ కార్డుల ద్వారా కొనేవారికి 2,000 రూపాయల తక్షణ డిస్కౌంట్ అందుతుంది. Citi బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్స్ పైన 1000 రూపాయలు, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ పైన 1500 డిస్కౌంట్ వంటి ఆఫర్లను శామ్సంగ్ గెలాక్సీ ఎం33 5జి ఫోన్ పైన అందించింది. ఈ ఫోన్ అమెజాన్ మరియు Samsung ఆన్లైన్ స్టోర్ నుండి లభిస్తుంది.
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి శామ్సంగ్ రివీల్ చేసిన స్పెక్స్ విషయానికి వస్తే, గెలాక్సీ ఎం33 5జి స్మార్ట్ ఫోన్ లో ఇన్ఫినిటీ-V కటౌట్ కలిగిన 6.6- ఇంచ్ TFT డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంటుంది. ఈ పూర్తి డిస్ప్లే ని గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో జత చేసింది. ఈ M33 ఫోన్ శామ్సంగ్ యొక్క సొంత 5G మరియు 5nm ప్రోసెసర్ Exynos 1280 కి జతగా 6/8GB LPDDR4x RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ ర్యామ్ కు సమానమైన వర్చువల్ ర్యామ్ ను కూడా ఇందులో అందించడం విశేషం.
ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 6000 mAh భారీ బ్యాటరీని కలిగివుంటుంది. అయితే, ఈ ఫోన్ బాక్స్ లో ఛార్జర్ ను మాత్రం అందించడం లేదని కంపెనీ తెలిపింది. పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడంలో చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇలా చేయవలసి వచ్చినట్లు శామ్సంగ్ స్పష్టం చేసింది. ఈ ఫోన్ లో 8MP సెల్ఫీ కెమెరాను ఇన్ఫినిటీ-V కటౌట్ లో అందించింది. అలాగే, 50MP ప్రధాన సెన్సార్, 5MP అల్ట్రావైడ్, 2MP డెప్త్ సెన్సార్ మరియు 2MP మాక్రో సెన్సార్ కలిగిన క్వాడ్ రియర్ కెమెరా మాడ్యూల్‌ను కలిగివుంది. ఈ ఫోన్ గ్రీన్ మరియు బ్లూ రెండు కలర్ అప్షన్ లలో కనిపిస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా One UI 4.1 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది.