64MP+8MP+5MP+5MP కెమేరా మరియు మరిన్ని గొప్ప ఫీచర్లతో విడుదలకానున్న Samsung Galaxy M31

Updated on 25-Feb-2020
HIGHLIGHTS

ఒక అతిపెద్ద 6,000mAh బ్యాటరీని కూడా అమర్చినట్లు అనౌన్స్ చేసింది.

భారతదేశంలో, శామ్సంగ్ తన M సిరీస్ ద్వారా బడ్జెట్ వినియోగదారులను ఆకర్శించడంతో పాటుగా, గొప్ప అమ్మకాలను కూడా సాధించింది. అందులో మరి ముఖ్యంగా శామ్సంగ్ గెలాక్సీ M30 ద్వారా ఎక్కువగా కొనుగోలుదారులను ఆకట్టుకుంది. ఇక గెలాక్సీ M30 తరువాత, ఇటీవల ఇండియాలో ఒక 48MP ట్రిపుల్ రియర్ కెమేరా మరియు 6,000mAh బ్యాటరీతో విడుదల చేసిన శామ్సంగ్ గెలాక్సీ M30s కూడా మంచి విజయాన్ని సాధించింది.

ఇక ఈ M సిరీస్ నుండి తరువాతి కొనసాగింపుగా, ఈ సిరిస్ నుండి గెలాక్సీ M31 స్నార్ట్ ఫోన్ను మార్కెట్లొకి తీసుకురావడానికి ఈరోజు డేట్ ని ప్రకటించింది. ఈ ఫోన్ను ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు ఇండియాలో విడుదల చెయ్యడానికి సమయాన్ని కేటాయించింది. అంతేకాదు,  ఏ ఫోన్ను ఎంచుకోవాడానికి ముఖ్యమైన మూడు ఫీచర్లను కూడా ప్రకటించింది. ముందుగా వచ్చిన అనేక లీకులు మరియు నివేదికలు ఇవే తెలియచేస్తున్నాయి.

ఈరోజు శామ్సంగ్ విడుదల చెయ్యనున్న ఈ గెలాక్సీ M31 స్మార్ట్ ఫోనులో అందించిన కెమేరా, డిస్ప్లే మరియు బ్యాటరీని సంస్థ గొప్పగా చెబుతోంది.  ఇందులో ముందుగా కెమేరా గురించి చూస్తే, ఇది వెనుక ఒక 64MP ప్రధాన కెమేరాగల క్వాడ్ కెమేరా సెటప్పుతో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ ప్రధాన కెమేరాకి జతగా  ఒక 8MP అల్ట్రా వైడ్ కెమేరా, ఒక 5MP డెప్త్ సెన్సింగ్ కెమేరా మరియు చివరిగా ఒక 5MP మ్యాక్రో సెన్సార్ కలగలిపిన క్వాడ్ కెమేరా సెటప్ ఇందులో ఇచ్చినట్లు ప్రకటించింది.

అలాగే, డిస్ప్లే గురించి కూడా ముందుగానే ప్రకటించింది. దీని ప్రకారం, ఇందులో FHD+ రిజల్యూషన్ అందించగల పెద్ద Super AMOLED డిస్ప్లేని ఇన్ఫినిటీ U నోచ్ తో అందించినట్లు తెలిపింది. ఇక చివరిగా, ఇందులో ఒక అతిపెద్ద 6,000mAh బ్యాటరీని కూడా అమర్చినట్లు అనౌన్స్ చేసింది. ఈ మూడు విషయాలను అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, అమేజాన్ ఇండియా ద్వారా కూడా ఈ ఫీచర్లతో టీజ్ చేస్తోంది.            

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :