అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి Samsung Galaxy M21 2021 Editon ఫస్ట్ సేల్

Updated on 24-Jul-2021
HIGHLIGHTS

అమెజాన్ ప్రైమ్ డే సేల్ న్యూ లాంచెస్ సేల్

శాంసంగ్ గెలాక్సీ M21 2021 ఎడిషన్ ఫస్ట్ సేల్

6000 mAh బిగ్ బ్యాటరీ మరియు పెద్ద AMOLED స్క్రీన్

అమెజాన్ తన ప్రైమ్ డే సేల్ ప్రకటించింది. ఈ సేల్ జూలై 26 న మొదలవుతుంది మరియు 27 రాత్రికి ముగుస్తుంది. అమెజాన్ ఈ ప్రత్యేకమైన సేల్ నుండి మంచి డీల్స్ మరియు ఆఫర్లను కూడా ప్రకటించింది. లేటెస్ట్ గా లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ M21 2021 ఎడిషన్ యొక్క ఫస్ట్ సేల్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి నిర్వహించనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ట్రూ 48ఎంపి ట్రిపుల్ కెమెరా, 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు పెద్ద AMOLED స్క్రీన్  వంటి గొప్ప ఫీచర్లతో వస్తుంది.

Samsung Galaxy M21 2021 Edition: ప్రత్యేకతలు

శామ్సంగ్ గెలాక్సీ M21 స్మార్ట్ ఫోన్ 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.4 అంగుళాల FHD రిజల్యూషన్ సూపర్ AMOLED ఇన్ఫినిటీ – U డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది గరిష్టంగా 2.3GHz క్లాక్ స్పీడ్ అందించగల ఒక ఎక్సినోస్ 9611 ఆక్టా కోర్ ప్రొసెసరు యొక్క శక్తితో నడుస్తుంది. ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 10 పైన ఆధారితంగా One UI శామ్సంగ్ యూజర్ ఎక్స్పీరియన్స్ పైన నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక అతిభారీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 4GB ర్యామ్ జతగా 64GB వేరియంట్ మరియు మరొక 6GB ర్యామ్ జతగా 128GB వేరియంట్తో వస్తుంది.

ఇక కెమెరావిభగానికి వస్తే, ఇది వెనుక భాగంలో 48MP +8MP+5MP ట్రిపుల్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇందులో f/2.0  ఎపర్చరు గల 48MP ప్రధాన కెమరా  మరియు 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కి జతగా 5MP డెప్త్ సెన్సార్ ని అందించింది. ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం 20MP సెల్ఫీ కెమెరాని అందించారు. సెల్ఫీలను క్లిక్ చేయడంతో పాటుగా ఇది పేస్ రికగ్నైజేషన్ కోసం కూడా ఉపయోగపడుతుంది. ఇందులో అందించిన స్టిక్కర్లతో మంచి ఫన్నీ ఫోటోలను సెల్ఫీలను తీసొకొవచ్చు మరియు కంటిన్యుయస్ షాట్స్ ఎంపికతో కూడా వస్తుంది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :