Samsung Galaxy M17 5G launch date and features confirmed
Samsung Galaxy M17 5G: శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను శాంసంగ్ ఇప్పుడు అనౌన్స్ చేసింది. అదే శాంసంగ్ గెలాక్సీ M17 5జి స్మార్ట్ ఫోన్ మరియు ఈ స్మార్ట్ ఫోన్ ను సూపర్ స్లిమ్ అండ్ స్ట్రాంగ్ డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ టీజర్ ద్వారా తెలియజేసింది. ఈ అప్ కమింగ్ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్స్ ఏమిటో ఒక లుక్కేద్దాం పదండి.
శాంసంగ్ గెలాక్సీ M17 5జి స్మార్ట్ ఫోన్ అక్టోబర్ 10వ తేదీ ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. ఎందుకంటే, ఈ స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ స్పెషల్స్ గా లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ కోసం అమెజాన్ అందించిన ప్రత్యేకమైన మైక్రో సైట్ టీజర్ పేజీ నుంచి ఈ అప్ కమింగ్ ఫోన్ కీలకమైన ఫీచర్స్ కూడా అందించింది.
Also Read: New Toll Rules: FASTag లేకపోతే వెంటనే తీసుకోండి లేకపోతే డబుల్ పేమెంట్ చెల్లించాలి.!
శాంసంగ్ గెలాక్సీ M17 5జి సూపర్ స్లిమ్ డిజైన్ తో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ కేవలం 7.5mm మందంతో సూపర్ స్లీక్ గా ఉంటుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ మరియు IP54 రేటింగ్ తో మంచి డ్యూరబిలిటీ కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ చూడటానికి గెలాక్సీ A సిరీస్ మాదిరి మెటల్ గ్రిప్ డిజైన్ తో ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇక ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో 50MP OIS మెయిన్ కెమెరా, 5MP అల్ట్రా వైడ్ మరియు 2MP మాక్రో కెమెరా లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 13MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో గూగుల్ యొక్క సర్కిల్ టూ సెర్చ్ విత్ గూగుల్ ఫీచర్ కూడా అందించింది. ఈ ఫోన్ కోసం కంపెనీ అందించిన టీజర్ పేజీ ద్వారా ఈ ఫోన్ చాలా స్టన్నింగ్ డిజైన్ తో ఉన్నట్లు కనిపిస్తోంది.