Samsung Galaxy M16 5G sale started with best offers
Samsung Galaxy M16 5G స్మార్ట్ టీవీ ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఇండియన్ మార్కెట్ లో శామ్సంగ్ బడ్జెట్ ధరలో విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు మంచి ఆఫర్స్ తో అందుకోవచ్చు. ఈ ఫోన్ ను సరికొత్త డిజైన్, ఫీచర్స్ మరియు గొప్ప ఫీచర్స్ తో శామ్సంగ్ అందించింది.
శామ్సంగ్ ఈ స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్లలో విడుదల చేసింది. ఈ ముడు వేరియంట్ ధరలు ఈ క్రింద చూడవచ్చు.
4GB + 128GB వేరియంట్ ధర : రూ. 12,499
6GB + 128GB వేరియంట్ ధర : రూ. 13,999
8GB + 128GB వేరియంట్ ధర : రూ. 15,499
ఈ స్మార్ట్ ఫోన్ పై ఈరోజు మంచి బ్యాంక్ అందించింది. ఈ శామ్సంగ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను Axis మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 1,000 అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను డిస్కౌంట్ ధరకే అందుకోవచ్చు.
Also Read: Women’s Day 2025: మీకు నచ్చిన వారికి కోసం ఉమెన్స్ డే బెస్ట్ గిఫ్ట్ ఆప్షన్.!
ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ సూపర్ AMOELD స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కేవలం 7.9 mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది. శామ్సంగ్ ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 6300 చిప్ సెట్ తో అందించింది మరియు జతగా 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ ను కూడా జతచేసింది.
ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా ఉంటుంది. ఈ ట్రిపుల్ కెమెరాలో 50MP మెయిన్ + 5MP అల్ట్రా వైడ్ + 2MP మాక్రో కెమెరాలు ఉంటాయి. ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ 6 జెనరేషన్ OS అప్డేట్స్ మరియు 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ కూడా అందిస్తుంది. ఈ ఫోన్ బ్లష్ పింక్, మింట్ గ్రీన్ మరియు థండర్ బ్లాక్ మూడు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.