Samsung Galaxy M15 5G ఈ టాప్ 5 ఫీచర్స్ తో ఏప్రిల్ 8న లాంఛ్ అవుతోంది.!

HIGHLIGHTS

Samsung Galaxy M15 5G ఇండియా లాంఛ్ డేట్ ను అనౌన్స్ చేసింది

ఈ ఫోన్ ఏప్రిల్ 8న ఇండియన్ మార్కెట్ లో లాంఛ్ అవుతుంది

ఈ ఫోన్ బడ్జెట్ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తునట్లు అర్ధమవుతోంది

Samsung Galaxy M15 5G ఇండియా లాంఛ్ డేట్ ను అనౌన్స్ చేసింది. సాంసంగ్ బడ్జెట్ సిరీస్ అయిన M సిరీస్ నుండి తీసుకు వస్తున్న ఈ ఫోన్ ఏప్రిల్ 8న ఇండియన్ మార్కెట్ అవుతుంది. లాంఛ్ డేట్ ను కన్ఫర్మ్ చేసిన కంపెనీ ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్లను కూడా అనౌన్స్ చేసింది. ఈ ఫీచర్స్ ద్వారా ఈ ఫోన్ బడ్జెట్ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తునట్లు అర్ధమవుతోంది.

Samsung Galaxy M15 5G ఎప్పుడు లాంఛ్ అవుతుంది?

సాంసంగ్ గెలాక్సీ ఎం15 5జి స్మార్ట్ ఫోన్ ను 4 ఏప్రిల్ 2024 మధ్యాహ్నం 12 గంటలకి ఇండియాలో విడుదల చేస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను అమేజాన్ స్పెషల్ గా తీసుకు వస్తోంది. అంటే, ఈ ఫోన్ సేల్ పార్ట్నర్ గా అమెజాన్ వ్యవహరిస్తుంది. అందుకే, అమేజాన్ ఈ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్స్ తో టీజింగ్ పేజ్ ను అందించింది.

Samsung Galaxy M15 5G టాప్ – 5 ఫీచర్స్

Display

Samsung Galaxy M15 5G Display

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ బిగ్ డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఇది FHD+ రిజల్యూషన్ కలిగిన AMOLED డిస్ప్లే మరియు 90 Hz రిఫ్రెష్ రేట్ ని కలిగి 800 నిట్స్ వరకూ పీక్ బ్రైట్నెస్ ని కూడా అందిస్తుంది.

Performance

Samsung Galaxy M15 5G Processor

సాంసంగ్ గెలాక్సీ ఎం15 5జి ఫోన్ మీడియాటెక్ Dimensity 6100+ ఆక్టా కోర్ 5G ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఇది బడ్జెట్ బెస్ట్ ప్రోసెసర్ గా చెప్పబడుతుంది మరియు ఈ బడ్జెట్ లో తగిన పెర్ఫార్మెన్స్ ను అందిస్తుంది.

Also Read: డిస్కౌంట్ ఆఫర్ తో చవక ధరకే లభిస్తున్న 5.1 Soundbar డీల్స్ ఇవిగో.!

Camera

Samsung Galaxy M15 5G Camera

సాంసంగ్ గెలాక్సీ ఎం15 5జి స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమేరా వుంది. ఈ కెమేరా సెటప్ లో 50MP మెయిన్ సెన్సార్ + 5MP అల్ట్రా వైడ్ + 2MP సెన్సార్ లు ఉన్నాయి మరియు ముందు 13MP సెల్ఫీ కెమేరా వుంది.

Battery

సాంసంగ్ గెలాక్సీ ఎం15 5జి ఫోన్ ను భారీ 6000 mAh బ్యాటరీ ఉన్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ యొక్క ఛార్జ్ టెక్ ను మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించ లేదు.

OS

ఈ ఫోన్ ను లేటెస్ట్ ఆండ్రాయిడ్ OS వెర్షన్ టి తీసుకు వస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ మరియు 4 OS అప్డేట్స్ ను అందుకుంటుందని కూడా సాంసంగ్ టీజింగ్ ద్వారా వెల్లడించింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :