Samsung Galaxy M14 5G: బడ్జెట్ ధరలో 50MP ట్రిపుల్ కెమేరాతో లాంచ్.!

HIGHLIGHTS

Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది

శామ్సంగ్ ఈ స్మార్ట్ ఫోన్ ను 15 వేల సబ్ కేటగిరిలో అందించింది

5nm ప్రోసెసర్ మరియు బిగ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలతో భారతీయ మార్కెట్ లోకి అడుగుపెట్టింది

Samsung Galaxy M14 5G: బడ్జెట్ ధరలో 50MP ట్రిపుల్ కెమేరాతో లాంచ్.!

శామ్సంగ్ ఈరోజు తన M సిరీస్ నుండి Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. శామ్సంగ్ ఈ స్మార్ట్ ఫోన్ ను 15 వేల సబ్ కేటగిరిలో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ 15 వేల బడ్జెట్ ధరలో 50MP ట్రిపుల్ కెమేరా, 5nm ప్రోసెసర్ మరియు బిగ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలతో భారతీయ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర, స్పెక్స్ మరియు ఫీచర్ల వంటి పూర్తి వివరాల పైన ఒక లుక్ వేద్దాం పదండి. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy M14 5G: ధర మరియు ఆఫర్లు 

శామ్సంగ్ గెలాక్సీ M14 5G స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్(4GB+128GB) ను బ్యాంక్ అఫర్ తో 13,490 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ పైన అందించిన బ్యాంక్ అఫర్ మరియు బ్యాంక్ పేరును మాత్రం ఇంకా తెలియ చేయ్యలేదు. దీనితో పాటుగా 6GB ర్యామ్ వేరియంట్ కూడా వుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి Amazon మరియు Samsung ఆన్లైన్ స్టోర్ నుండి సేల్ మొదలవుతుంది. 

Samsung Galaxy M14 5G: ప్రత్యేకతలు 

శామ్సంగ్ గెలాక్సీ M14 5G పెద్ద 6000mAh బ్యాటరీని 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది ఈ ధర సెగ్మెంట్ లో. ఈ ఫోన్ శామ్సంగ్ సొంత 5nm ప్రోసెసర్ Exynos 1330 5G SoC జతగా 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో వచ్చింది. ఈ ఫోన్ One UI Core 5.1 సాఫ్ట్ వేర్ తో Android 13 OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 4 ఇయర్స్ రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ మరియు రెండు మేజర్ OS అప్డేట్స్ అందుకుంటుందని కంపెనీ తెలిపింది. 

ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమేరాని శామ్సంగ్ అందించింది. ఇందులో, 50MP ప్రధాన కెమేరా, 2MP మరియు 2MP సెన్సార్ లు ఉన్నాయి. ఈ ఫోన్ లో 13MP సెల్ఫీ కెమెరా కూడా ముందు భాగంలో వుంది. ఇక ఈ ఫోన్ డిస్ప్లే విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 90Hz రిఫ్రెష్ రేట్ తో 6.6 ఇంచ్ FHD+ రిజల్యూషన్ డిస్ప్లేని అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile