Samsung అతితక్కువ ధరకే Galaxy F02s స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది.

HIGHLIGHTS

అతితక్కువ ధరలో F02s స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది.

గెలాక్సీ F02s కేవలం రూ. 8,999 రూపాయల ప్రారంభ ధరతో ప్రకటించబడింది.

సాంసంగ్ తన గెలాక్సీ సిరీస్ అతితక్కువ ధరలో F02s స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది.  ఈ గెలాక్సీ F02s కేవలం రూ. 8,999 రూపాయల ప్రారంభ ధరతో ప్రకటించబడింది. ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా, బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ ప్రాసెసర్, పెద్ద బ్యాటరీ మరియు మరిన్ని  ఫీచర్లతో వచ్చింది.

Samsung Galaxy F02s : ధరలు

1.Samsung Galaxy F02s – 3GB + 32GB : Rs.8,990/-

2.Samsung Galaxy F02s – 4GB + 64GB : Rs.9,990/-

ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ ఏప్రిల్ 9 న మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతుంది. 

Samsung Galaxy F02s : ప్రత్యేకతలు

సాంసంగ్ గెలాక్సీ F02s ఫోన్ పెద్ద 6.5 -అంగుళాల HD + రిజల్యూషన్ గల డిస్ప్లే తో వుంటుంది. ఈ స్క్రీన్ 20: 9 ఎస్పెక్ట్ రేషియోని కలిగి ఉంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 450 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో వస్తుంది. ఇది 4GB RAM మరియు 64 స్టోరేజ్ వరకూ ఎంపికతో జత చేయబడుతుంది. ఇది వన్ UI కోర్ ఆధారితంగా ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే, ఈ గెలాక్సీ F02s వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. దీనిలో ప్రాధమిక కెమెరా 13MP సెన్సార్ తో అందించింది. దీనికి జతగా 2MP డెప్త్ సెన్సార్ మరియు 2MP మాక్రో సెన్సార్ లను జతచేసింది. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో ఉన్న నోచ్ లోపల 5 MP సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ పెద్ద 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 15W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగివుంది.  

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :