Samsung Galaxy F70e 5G: బిగ్ బ్యాటరీ తో బడ్జెట్ 5G ఫోన్ గా లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

ఇండియన్ మార్కెట్లో శాంసంగ్ ఈరోజు కొత్త 5జి స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది

Samsung Galaxy F70e 5G ను బడ్జెట్ ధరలో చాలా పెద్ద బ్యాటరీ మరియు లెథర్ ఫినిష్ ఫీచర్స్ తో అందించింది

ఈ ఫోన్ వెనుక లెథర్ ఫినిష్ తో మంచి స్లీక్ డిజెన్ తో అందంగా ఉంటుంది

Samsung Galaxy F70e 5G: ఇండియన్ మార్కెట్లో శాంసంగ్ ఈరోజు కొత్త 5జి స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో చాలా పెద్ద బ్యాటరీ మరియు లెథర్ ఫినిష్ వంటి మంచి ఆకట్టుకునే ఫీచర్స్ తో ఇండియాలో అందించింది. ఈ లేటెస్ట్ శాంసంగ్ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ ధర, ఆఫర్స్ మరియు కంప్లీట్ ఫీచర్స్ ఒక లుక్కేద్దామా.

Samsung Galaxy F70e 5G: ప్రైస్

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 70e స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో విడుదల రిలీజ్ చేసింది. ఇందులో 4 జీబీ + 128 జీబీ బేసిక్ వేరియంట్ ను రూ. 12,999 ప్రైస్ తో మరియు హై ఎండ్ 6 జీబీ + 128 జీబీ వేరియంట్ ను రూ. 14,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లైమ్ లైట్ గ్రీన్ మరియు స్పాట్ లైట్ గ్రీన్ రెండు రంగుల్లో లభిస్తుంది.

ఆఫర్స్

ఇక శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 70e స్మార్ట్ ఫోన్ పై అందించిన ఆఫర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ పై రూ. 500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ రూ. 12,499 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. 17 ఫిబ్రవరి 2026 మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ ఫస్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ Flipkart మరియు శాంసంగ్ అఫీషియల్ సైట్ నుంచి సేల్ అవుతుంది.

Also Read: భారీ డిస్కౌంట్ తో కేవలం 55 ఇంచ్ టీవీ రేటుకే లభిస్తున్న 65 ఇంచ్ Mini LED Smart Tv

Samsung Galaxy F70e 5G: ఫీచర్స్

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 70e ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు HD+ రిజల్యూషన్ కలిగిన 6.7 ఇంచ్ PLS LCD స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 260 PPI మరియు 16M కలర్ డెప్త్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ చిప్ సెట్ Dimensity 6300 తో నడుస్తుంది. అలాగే, ఈ ఫోన్ 4 జీబీ / 6 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ తో కూడా వస్తుంది.

ఈ శాంసంగ్ కొత్త ఫోన్ లో వెనుక 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ 30FPS వద్ద FHD (1920 x 1080) వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు స్లోమోషన్, నైట్ మోడ్ వంటి అదనపు ఫీచర్లు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ వెనుక లెథర్ ఫినిష్ తో మంచి స్లీక్ డిజెన్ తో అందంగా కూడా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :