లీకైన శామ్సంగ్ గెలాక్సీ F54 ఫోన్ ధర..కొత్త లీక్స్ ఏమి చెబుతున్నాయి.!

HIGHLIGHTS

శామ్సంగ్ గెలాక్సీ F54 ఫోన్ ధర ఆన్లైన్ లో లీక్

ఈ ఫోన్ యొక్క స్పెక్స్ మరియు ఫీచర్లు ఇప్పటికే ఆన్లైన్ లీకర్స్ ద్వారా లీకయ్యాయి

గెలాక్సీ F సిరీస్ లో ఖరీదైన ఫోన్ గా ఉండవచ్చని అనిపిస్తోంది

లీకైన శామ్సంగ్ గెలాక్సీ F54 ఫోన్ ధర..కొత్త లీక్స్ ఏమి చెబుతున్నాయి.!

శామ్సంగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ శామ్సంగ్ గెలాక్సీ F54 ఫోన్ ధర ఆన్లైన్ లో లీక్ అయ్యింది. ఈ లీకైన ధర ను చూస్తుంటే, శామ్సంగ్ గెలాక్సీ F54 ఫోన్ ఇప్పటి వరకూ గాలక్సీ F సిరీస్ లో వచ్చిన స్మార్ట్ ఫోన్స్ అన్నింటిలో కూడా ఖరీదైన ఫోన్ గా ఉండవచ్చని అనిపిస్తోంది. ఈ ఫోన్ యొక్క స్పెక్స్ మరియు ఫీచర్లు ఇప్పటికే ఆన్లైన్ లీకర్స్ ద్వారా లీకయ్యాయి. ఇప్పుడు ఈ ఫోన్ రూమర్ ధర కూడా లీక్ కావడం గమనార్హం. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

శామ్సంగ్ గెలాక్సీ F54 ఫోన్ యొక్క 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో రూ. 35,999 రూపాయల ధరలో ప్రవేశ పెట్టవచ్చని ఆన్లైన్ రూమర్లు చెబుతున్నాయి. అంతేకాదు, ఈ ఫోన్ శామ్సంగ్ గెలాక్సీ F మోస్ట్ ఎక్స్ పెన్సివ్ స్మార్ట్ ఫోన్ అవుతుందని కూడా లీకర్స్ చెబుతున్నారు. అయితే, ఇది బేసిక్ వేరియంట్ ధర లేదా హై ఎండ్ వేరియంట్ ధర అనే విషయాన్ని మాత్రం ప్రస్తావించ లేదు. 

వాస్తవానికి, ముందుగా ఈ శామ్సంగ్ గెలాక్సీ F54 ఫోన్ ఏప్రిల్ నెల చివరి నాటికి లాంచ్ అవుతుందని ఊహించారు. కానీ, ఇప్పుడు ఈ ఫోన్ ఈ నెల చివరి నాటికీ రావచ్చని అంచనా వేస్తున్నారు. 

ఇక శామ్సంగ్ గెలాక్సీ F54 ఫోన్ యొక్క స్పెక్స్ గురించి వచ్చిన ఆన్లైన్ లేక్స్ మరియు రూమర్ల ప్రకారం, ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లే, Exynos 1380 ప్రోసెసర్, OIS సపోర్ట్ తో 108 MP రియర్ ట్రిపుల్ కెమేరా సెటప్ మరియు 6000 mAh హెవీ బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

అయితే, శామ్సంగ్ గెలాక్సీ F54 ఫోన్ గురించి కంపెనీ అధికారిక ప్రకటన చేసే వరకూ వేచి చూడవలసి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo