శామ్సంగ్ లేటెస్ట్ బడ్జెట్ 5G ఫోన్ Galaxy F14 ఫస్ట్ సేల్ రేపు జరగనున్నది.!

Updated on 29-Mar-2023
HIGHLIGHTS

శామ్సంగ్ లేటెస్ట్ బడ్జెట్ 5G ఫోన్ Galaxy F14 ఫస్ట్ సేల్ రేపు జరగనున్నది

శామ్సంగ్ సరికొత్తగా Samsung galxy F14 5G ను విడుదల చేసింది

లాంచ్ ఆఫర్లు మరియు డీల్స్ తో రేపటి నుండి ఈ స్మార్ట్ ఫోన్ సేల్ కి అందుబాటులో ఉంటుంది

శామ్సంగ్ లేటెస్ట్ బడ్జెట్ 5G ఫోన్ Galaxy F14 ఫస్ట్ సేల్ రేపు జరగనున్నది. ఇండియాలో శామ్సంగ్ సరికొత్తగా Samsung galxy F14 5G ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్ ఫోన్ ను Samsung సొంత 5nm ప్రోసెసర్ Exynos 1330 5G మరియు అదనపు స్పీడ్ కోసం Ram Plus ఫీచర్ ను కూడా ఈ అందించినట్లు కంపెనీ తెలిపింది. లాంచ్ ఆఫర్లు మరియు డీల్స్ తో రేపటి నుండి ఈ స్మార్ట్ ఫోన్ సేల్ కి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్స్ ను ఇక్కడ చూడవచ్చు.     

Samsung Galaxy F14 5G: ధర

శామ్సంగ్ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ (4GB+128GB) ను రూ.14,490 రూపాయల ధరతో విడుదల చేసింది. అలాగే, మరోక వేరియంట్ 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో ధర రూ.15,990. ఈ స్మార్ట్ ఫోన్ పైన లాంచ్ అఫర్ లో భాగంగా మంచి బ్యాంక్ ఆఫర్లను కూడా అందించింది. ఈ ఫోన్ ను క్రెడిట్/డెబిట్ EMI మరియు క్రెడిట్ కార్డ్ పేమెంట్ ద్వారా కొనుగోలు చేసే వారికి రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ మార్చి 30 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి Flipkart మరియు Samsung ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ స్టోర్ ల నుండి లభిస్తుంది.                

Samsung Galaxy F14 5G: స్పెక్స్

Samsung Galaxy F14 5G స్మార్ట్ ఫోన్ 6.58 ఇంచ్ FHD+ డిస్ప్లేని కలిగి వుంటుంది. అంతేకాదు, ఈ డిస్ప్లే రక్షణ కోసం దీన్ని గొరిల్లా గ్లాస్ 5 తో ప్యాక్ చేసినట్లు తెలిపింది. శామ్సంగ్ గెలాక్సీ F14 5G ఫోన్ కంపెనీ యొక్క సొంత 5nm ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పనిచేస్తుంది. అదే, Exynnos 1330 5G ప్రోసెసర్ మరియు దీనికి 4GB/6GB ర్యామ్ జతగా RAM Plus ఫీచర్ కూడా వుంది. 

ఈ ఫోన్ 13 5G బ్యాండ్ లకు సపోర్ట్ చేస్తుందని, 4 సెక్యూరిటీ అప్డేట్స్ మరియు 2 OS అప్గ్రేడ్స్ ను కూడా అందుకుంటుందని కూడా శామ్సంగ్ తెలిపింది. ఈ ఫోన్ ను భారీ 6,000mAh బిగ్ బ్యాటరీతో మరియు 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ Android 13OS ఆధారితమైన లేటెస్ట్ One UI 5.0 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :