ఈరోజు Samsung పది వేలకే జబర్దస్త్ ఫోన్ విడుదల చేసింది

HIGHLIGHTS

గెలాక్సీ సిరీస్ నుండి F12 విడుదల

ఈ ఫోన్ కేవలం రూ.9,999 ధరకే అఫర్ చేస్తోంది.

ఈ ఫోన్ ఎక్సినోస్ 850 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో వస్తుంది.

ఈరోజు సాంసంగ్ తన గెలాక్సీ సిరీస్ నుండి సరికొత్త స్మార్ట్ ఫోన్ F12 ను విడుదల చేసింది.  ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 10,999 రూపాయల  ధరతో ప్రకటించబడింది. అయితే, ఇంట్రడక్టరి అఫర్ క్రింద ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు మరియు EMI ట్రాన్సాక్షన్ తో కొనేవారికి ఈ ఫోన్ కేవలం రూ.9,999 ధరకే అఫర్ చేస్తోంది. ఈ ఫోన్ 48MP క్వాడ్ కెమెరా లేటెస్ట్ 8nm ప్రాసెసర్, పెద్ద బ్యాటరీ మరియు మరిన్ని  ఫీచర్లతో వచ్చింది.

Samsung Galaxy F12: ధరలు

1.Samsung Galaxy F12 – 4GB + 64GB : Rs.10,990/-

2.Samsung Galaxy F12 – 4GB + 128GB : Rs.11,990/-

ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ ఏప్రిల్ 12 న మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతుంది.  

1.Samsung Galaxy F12: ప్రత్యేకతలు

సాంసంగ్ గెలాక్సీ F12 స్మార్ట్ ఫోన్ 6.5 -అంగుళాల HD + రిజల్యూషన్ గల డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. ఈ స్క్రీన్ 20: 9 ఎస్పెక్ట్ రేషియోని కలిగి ఉంది. ఈ ఫోన్ ఎక్సినోస్ 850 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో వస్తుంది. ఇది 4GB RAM మరియు 64/128GB స్టోరేజ్ ఎంపికతో జత చేయబడుతుంది. ఇది వన్ UI 3.1 కోర్ ఆధారితంగా ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది.

ఇక కెమెరాల పరంగా, సాంసంగ్ గెలాక్సీ F12 వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ తో వస్తుంది. దీనిలో ప్రాధమిక కెమెరాని 48MP Samsung GM2  సెన్సార్ తో అందించింది. దీనికి జతగా 5MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2MP మాక్రో మరియు 2MP డెప్త్ సెన్సార్ లను జతచేసింది. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో ఉన్న నోచ్ లోపల 8 MP సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ అతిపెద్ద 6,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 15W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది.   

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :