ఇటీవల సాంసంగ్ కేవలం పదివేల రూపాయల ధరలో విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ సాంసంగ్ గెలాక్సీ F12 యొక్క మొదటి సేల్ ఈరోజు జరగనుంది. ఈ ఫోన్ ట్రూ 48MP క్వాడ్ కెమెరా, అతిపెద్ద బ్యాటరీ మరియు 8nm ఫ్యాబ్రికేషన్ ఆక్టా కోర్ ప్రాసెసర్ వంటి భారీ ఫీచర్లతో వచ్చింది. ఈ గెలాక్సీ F12 యొక్క మొదటి సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు Flipkart నుండి మొదలవుతుంది.
1.Samsung Galaxy F12 – 4GB + 64GB : Rs.10,990/-
2.Samsung Galaxy F12 – 4GB + 128GB : Rs.11,990/-
ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ ఏప్రిల్ 12 న మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతుంది.
సాంసంగ్ గెలాక్సీ F12 స్మార్ట్ ఫోన్ 6.5 -అంగుళాల HD + రిజల్యూషన్ గల డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. ఈ స్క్రీన్ 20: 9 ఎస్పెక్ట్ రేషియోని కలిగి ఉంది. ఈ ఫోన్ ఎక్సినోస్ 850 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో వస్తుంది. ఇది 4GB RAM మరియు 64/128GB స్టోరేజ్ ఎంపికతో జత చేయబడుతుంది. ఇది వన్ UI 3.1 కోర్ ఆధారితంగా ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది.
ఇక కెమెరాల పరంగా, సాంసంగ్ గెలాక్సీ F12 వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ తో వస్తుంది. దీనిలో ప్రాధమిక కెమెరాని 48MP Samsung GM2 సెన్సార్ తో అందించింది. దీనికి జతగా 5MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2MP మాక్రో మరియు 2MP డెప్త్ సెన్సార్ లను జతచేసింది. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో ఉన్న నోచ్ లోపల 8 MP సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ అతిపెద్ద 6,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 15W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది.