భారీ ఆఫర్లతో శామ్సంగ్ బడ్జెట్ ఫోన్ Galaxy F04 ఫస్ట్ సేల్..!

శామ్సంగ్ ఇండియాలో సరికొత్తగా విడుదల చేసిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Galaxy F04 ఫస్ట్ సేల్ రేపు జరగనున్నది. రేపటి సేల్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ పైన అందించిన లాంచ్ ఆఫర్లను కూడా పొందే వీలుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్, పెద్ద డిస్ప్లే మరియు 4GB ర్యామ్ ప్లస్ టెక్నాలజీ వంటి మరిన్ని ఫీచర్లను కలిగివుంటుంది. రేపటి నుండి సేల్ కి అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర, స్పెక్స్ మరియు ఫీచర్ల పైన ఒక లుక్కేయండి.

Samsung Galaxy F04: ధర

శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్04 స్మార్ట్ ఫోన్ ను రూ. 9,499 రూపాయల ధరతో లాంచ్ చేసింది. అయితే, లాంచ్ అఫర్ లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ రూ.8,999 రూపాయలకు లభిస్తుంది.  ఈ ఫోన్ జనవరి 12 నుండి శామ్సంగ్ స్టోర్ మరియు Flipkart నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ను ICICI మరియు citi బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.             

Samsung Galaxy F04: స్పెక్స్

శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్04 స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ డిస్ప్లేను కలిగివుంది. ఈ డిస్ప్లే ఇన్ఫినిటీ V- నోచ్ తో వస్తుంది మరియు ఇందులో 5MP సెల్ఫీ కెమెరాని కలిగివుంది.ఈ ఫోన్ మీడియాటెక్ Helio P35 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో మరియు 4GB మరియు 4 ర్యామ్ ప్లస్ తో జతగా వస్తుంది. 

ఈ ఫోన్ వెనుక డ్యూయల్ కెమేరా సెటప్ వుంది. ఈ సెటప్ లో 13MP మెయిన్ కెమేరా మరియు 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి.ఈ ఫోన్ 3.5mm జాక్, డ్యూయల్ 4G VoLTE,  WiFi ac మరియు Bluetooth 5.0 ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ Android 12 ఆధారిత One UI  సాఫ్ట్‌వేర్‌ తో పనిచేస్తుంది మరియు రెండు సంవత్సరాల OS అప్డేట్స్ అందుకుంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ పెద్ద 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :