Samsung Galaxy A35 5G: ఫ్లిప్ కార్ట్ సేల్ చివరి రోజు ఆల్ టైం చవక ధరలో లభిస్తోంది.!

Updated on 29-Dec-2025
HIGHLIGHTS

Samsung Galaxy A35 5G ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ నుంచి ఆల్ టైం చవక ధరలో లభిస్తుంది

ఈ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి దాదాపు 10 వేల రూపాయల తగ్గింపు ధరలో లభిస్తుంది

ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈ ఫోన్ ను 17 వేల రూపాయల బడ్జెట్ ప్రైస్ లో మీ సొంతం చేసుకోవచ్చు

Samsung Galaxy A35 5G: శాంసంగ్ గెలాక్సీ ఎ35 స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ నుంచి ఆల్ టైం చవక ధరలో లభిస్తుంది. 25 వేల నుంచి 30 వేల రూపాయల మిడ్ రేంజ్ ప్రైస్ తో ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి దాదాపు 10 వేల రూపాయల తగ్గింపు ధరలో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈ ఫోన్ ను 17 వేల రూపాయల బడ్జెట్ ప్రైస్ లో మీ సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ ఈరోజుతో ముగుస్తుంది కాబట్టి, ఈరోజు మాత్రమే లభించే ఈ డీల్ పై ఒక లుక్కేద్దామా.

Samsung Galaxy A35 5G: ఆఫర్

శాంసంగ్ గెలాక్సీ ఏ 35 స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 27,999 రూపాయల ప్రారంభ ధరతో 2024 మార్చి నెలలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ నుంచి రూ. 9,500 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 18,499 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ SBI మరియు ఫ్లిప్ కార్ట్ Axis క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 5% అదనపు డిస్కౌంట్ కూడా ఫ్లిప్ కార్ట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం రూ. 17,574 రూపాయల ఆల్ టైం చవక ధరలో మీకు లభిస్తుంది.

Samsung Galaxy A35 5G: ఫీచర్స్

శాంసంగ్ గెలాక్సీ ఏ 35 స్మార్ట్ ఫోన్ చాలా కంఫర్ట్ అండ్ ప్రీమియం డిజైన్ తో ఉంటుంది. ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్ తో ఉన్నా కూడా చాలా ప్రీమియం మెటల్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ ముందు మరియు వెనుక కూడా గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ఉంటుంది. అందుకే, ఈ ఫోన్ డిజైన్ పరంగా చాలా పటిష్టంగా మరియు ప్రీమియం గా ఉంటుంది. ఇందులో 6.6 ఇంచ్ సూపర్ AMOLED స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు మంచి బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ శాంసంగ్ యొక్క సొంత ప్రోసెసర్ Exynos 1380 తో పనిచేస్తుంది. ఇందులో, 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 తో వస్తుంది మరియు 3 మేజర్ అప్డేట్స్ మరియు 4 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా అందుకుంటుంది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Also Read: 7.35mm స్లీక్ అండ్ లైట్ వెయిట్ డిజైన్ తో Poco M8 5G లాంచ్ కన్ఫర్మ్ చేసిన పోకో.!

ఇక కెమెరా విభాగానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ మరియు ముందు 13MP సెంటర్ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇందులో, వెనుక 50MP మెయిన్, 8MP అల్ట్రా వైడ్ మరియు 5MP మాక్రో కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ సర్కిల్ టు ఫైండ్ మరియు అబ్జెక్ట్ ఎరేజర్ వంటి చాలా AI ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 30FPS స్టేబుల్ 4K వీడియో సపోర్ట్ తో వస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్ డీల్ గురించి చెప్పాలంటే, ఈ బడ్జెట్ ప్రైస్ లో తగిన అన్ని ఫీచర్స్ కలిగి ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :