Samsung galaxy A32 కొత్త వేరియంట్ లాంచ్..కొత్త ఫీచర్ అదిరింది..!

HIGHLIGHTS

Samsung galaxy A32 స్పెషల్ వేరియంట్ వచ్చింది

అదనపు ర్యామ్ ను సమకూర్చే ఫీచర్ ని అందించింది

సాంసంగ్ గెలాక్సీ ఏ 32 యొక్క స్పెషల్ వేరియంట్ ను ఈరోజు Samsung విడుదల చేసింది. ఈ ఫోన్  స్టైలిష్ డిజైన్, పవర్ ఫుల్ బ్యాటరీ, 800 నిట్స్ గరిష్ఠమైన బ్రైట్నెస్ అందించ గల 90Hz Super AMOLED డిస్ప్లే వంటి చాలా ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది. అయితే, కొత్త వేరియంట్ లో 8GB ర్యామ్ ను ఇంటలిజంట్ మెమొరీ ఎక్స్పెన్షన్ తో 4GB వరకూ అదనపు ర్యామ్ ను సమకూర్చే ఫీచర్ ని అందించింది.

సాంసంగ్ గెలాక్సీ ఏ 32: ధర

ఈ ఫోన్ 8జీబీ మరియు 128జీబీ స్టోరేజ్ గల వేరియంట్ ను రూ.23,499 రూపాయల ప్రైస్ తో అందించింది. ఈ ఫోన్, ఆసమ్ బ్లాక్, ఆసమ్ బ్లూ మరియు ఆసమ్ వయోలెట్ వంటి మూడు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. ఈ ఫోన్ అన్ని రిటైల్ స్టోర్స్, ఆన్లైన్ పోర్టల్స్ మరియు Samsung.com నుండి లభిస్తుంది.      

సాంసంగ్ గెలాక్సీ ఏ 32: స్పెషిఫికేషన్స్

సాంసంగ్ గెలాక్సీ ఏ 32 ఒక 6.4 అంగుళాల FHD+ డిస్ప్లే ని తో ఉంటుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 800 నైట్స్ గరిష్ట బ్రెట్ నెస్ సామర్ధ్యం గల Super AMOLED డిస్ప్లే. ఈ  ఫోన్ వెనుక భాగంలో కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 వుంటుంది. గెలాక్సీ ఏ 32 మీడియా టెక్ హీలియో G80 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు మాలీ-G52 GPU తో పనిచేస్తుంది. దీనికి జతగా 6జీబీ/8జీబీ ర్యామ్ మరియు 128జీబీ వరకూ ఇంటర్నల్ స్టోరేజ్ తో లభిస్తుంది. ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది మరియు One UI 3.0 స్కిన్ తో వుంటుంది.

కెమెరాల పరంగా , ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. ఇందులో, 64ఎంపీ మైన్ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 5ఎంపీ డెప్త్ సెన్సార్ మరియు 5ఎంపీ మ్యాక్రో సెన్సార్ లను కలిగి ఉంటుంది. ఇక సెల్ఫీల కోసం 20ఎంపీ సెల్ఫీ కెమెరాని ఫోన్ ముందు భాగంలో ఉంచింది. సెక్యూరిటీ కోసం ఇందులో ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కూడా అందించింది. ఇందులో, 5000 mAh బ్యాటరీని 15W అడాప్టివ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :