Samsung Galaxy A07 5G బిగ్ బ్యాటరీతో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

Samsung Galaxy A07 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో లాంచ్ అయ్యింది

శాంసంగ్ గెలాక్సీ ఏ 07 స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో అందించింది

ఈ ఫోన్ 6000 mah బిగ్ బ్యాటరీ మరియు 50MP డ్యూయల్ రియర్ కెమెరా వంటి ఫీచర్స్ తో ఈరోజు విడుదల చేయబడింది

Samsung Galaxy A07 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 6000 mah బిగ్ బ్యాటరీ మరియు 50MP డ్యూయల్ రియర్ కెమెరా వంటి ఫీచర్స్ తో ఈరోజు ఇండియాలో విడుదల చేయబడింది. ఈ మధ్య శాంసంగ్ విడుదల చేస్తున్న చాలా ఫోన్లు కూడా ఎక్కువ కాలం అప్‌డేట్స్ అందుకునే అవకాశం తో వస్తున్నాయి మరియు ఈ ఫోన్ ను కూడా దీర్ఘకాలం సెక్యూరిటీ అప్‌డేట్స్ తో విడుదల చేసింది.

Samsung Galaxy A07 5G : ప్రైస్

శాంసంగ్ గెలాక్సీ ఏ 07 స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో అందించింది. ఈ ఫోన్ స్టార్టింగ్ (4GB + 128GB) వేరియంట్ ను రూ. 15,999 ధరతో మరియు హై ఎండ్ (4GB + 128GB) వేరియంట్ ను రూ. 17,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ రూ. 1,000 రూపాయల HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. బ్లాక్, లైట్ గ్రీన్ మరియు లైట్ వయొలెట్‌ ముందు రంగుల్లో ఈ ఫోన్ ను అందించింది. ఈ ఫోన్ ఈరోజు నుంచే అమెజాన్ ఇండియా మరియు శాంసంగ్ అఫీషియల్ సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది.

Also Read: Vivo V70 మరియు V70 Elite ఇండియా లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన వివో.!

Samsung Galaxy A07 5G : ఫీచర్స్

శాంసంగ్ గెలాక్సీ ఏ 07 స్మార్ట్ ఫోన్ HD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7 అంగుళాల LCD స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 6300 5G చిప్ సెట్ తో మరియు 6GB ర్యామ్ జతగా 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ One UI 8 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 16 OS తో వచ్చింది. ఈ ఫోన్ 6 సంవత్సరాల OS మరియు సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుంది. అంటే, లాంగ్ టైమ్ ఈ ఫోన్ సెక్యూర్ గా ఉంటుందని అర్థం.

ఈ ఫోన్ లో వెనుక 50MP మెయిన్ + 2MP డెప్త్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 1080p రిజల్యూషన్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ 6000mAh భారీ బ్యాటరీ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. బయోమెట్రిక్ డేటా అండ్ ఎన్ క్రిప్షన్ సెన్సిటివ్ డేటా భద్రత కోసం శాంసంగ్ Knox Vault ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :