Galaxy Z Flip 7 మరియు Z Flip 7FE పై ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటించిన శాంసంగ్.!

Updated on 08-Aug-2025
HIGHLIGHTS

Galaxy Z Flip 7 మరియు Z Flip 7FE పై ప్రత్యేకమైన ఆఫర్లు అనౌన్స్

ప్రత్యేకమైన ఆఫర్స్ తో ఈ ఫోన్ లను మంచి డిస్కౌంట్ ప్రైస్ లో అందుకోవచ్చు

ఇది శాంసంగ్ ప్రకటించిన ప్రత్యేకమైన ఆఫర్

శాంసంగ్ లేటెస్ట్ గా విడుదల చేసిన ఫ్లిప్ ప్లాన్స్ Galaxy Z Flip 7 మరియు Z Flip 7FE పై ప్రత్యేకమైన ఆఫర్లు అనౌన్స్ చేసింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా ప్రీమియం ఫీచర్స్ తో ప్రీమియం ధరలో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయ్యాయి. అయితే, శాంసంగ్ కొత్తగా అనౌన్స్ చేసిన ప్రత్యేకమైన ఆఫర్స్ తో ఈ ఫోన్ లను మంచి డిస్కౌంట్ ప్రైస్ లో అందుకోవచ్చు. ఈ రెండు ఫోన్ల పై శాంసంగ్ అందించిన ఆ ప్రత్యేకమైన ఆఫర్లు ఏమిటో ఒక లుక్కేద్దామా.

Galaxy Z Flip 7 మరియు Z Flip 7FE

శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 ఫోన్స్ పై రూ. 12,000 రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఈ కొత్త ఎక్స్ క్లూజివ్ ఆఫర్ ద్వారా అందించింది. ఇందులో క్యాష్ బ్యాక్ మరియు అప్ గ్రేడ్ బోనస్ వంటి డిస్కౌంట్ ఆఫర్స్ ఉంటాయి. ఈ ఫోన్స్ విడుదలైన 48 గంటల్లో 2 లక్షల 10 వేలకు పైగా ప్రీ ఆర్డర్స్ అందుకున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే, ఈ ఫోన్ ను కొత్త ఆఫర్స్ తో మరింత డిస్కౌంట్ ధరలో అందుకునే అవకాశం ఉంటుంది.

Samsung Galaxy Z Flip 7 : ఆఫర్

శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్7 స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 1,09,999 బేసిక్ ప్రైస్ తో లాంచ్ అయ్యింది. అయితే, ఇప్పుడు శాంసంగ్ ప్రకటించిన ప్రత్యేకమైన ఆఫర్ తో కేవలం రూ. 97,999 రూపాయల ప్రారంభ ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ ను HDFC మరియు Axis కార్డ్స్ తో ఫుల్ పేమెంట్ చేసే వారికి రూ. 12,000 డిస్కౌంట్ అందిస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ ను ఎక్స్ చేంజ్ ఆఫర్ తో తీసుకునే వారికి కూడా రూ. 12,000 రూపాయల వరకు ఎక్స్ చేంజ్ బోనస్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ తో ఈ ఫోన్ కేవలం రూ. 97,999 ధరలో లభిస్తుంది.

Also Read: Poco M7 Plus 5G ఫోన్ బిగ్ సినిమాటిక్ డిస్ప్లేతో లాంచ్ అవుతోంది.!

శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 FE : ఆఫర్లు

శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 FE స్మార్ట్ ఫోన్ రూ. 89,999 బేసిక్ ప్రైస్ ట్యాగ్ తో ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ పై కూడా రూ. 10,000 రూపాయల తగ్గింపు అందుకునే అవకాశం అందించారు. ఈ ఫోన్ ను HDFC మరియు Axis కార్డ్స్ తో ఫుల్ పేమెంట్ చేసే వారికి రూ. 10,000 భారీ తగ్గింపు నేరుగా లభిస్తుంది. ఈ ఫోన్ ను ఎక్స్ చేంజ్ తో తీసుకునే వారికి కూడా రూ. 10,000 రూపాయల ఎక్స్ చేంజ్ బోనస్ అందుకునే అవకాశం అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను రూ. 79,999 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.

ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా లేటెస్ట్ ఫాస్ట్ చిప్ సెట్, బిగ్ బ్యాటరీ మరియు ప్రీమియం ఫీచర్లతో లాంచ్ అయ్యాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :